Covid 19 cases in India: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,33,504 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 4200 కేసులు తక్కువగా నమోదైనప్పటికీ... కేసుల సంఖ్య వరుసగా నాలుగో రోజు 3 లక్షలు దాటం ఆందోళన కలిగిస్తోంది. తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకూ నమోదైన కరోనా కేసుల సంఖ్య 3.92 కోట్లకు చేరింది. మరో 525 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో దేశంలో కరోనాతో మృతి చెందినవారి సంఖ్య 4,89,409కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,87,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 2,59,168 మంది కరోనా (Coronavirus) నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా పేషెంట్ల రికవరీల సంఖ్య 3,65,60,650కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 93.18 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 17.22 శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 17.78 శాతంగా ఉంది.దేశంలో ఇప్పటివరకూ 161,92,84,270 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. అలాగే 79 లక్షల పైచిలుకు బూస్టర్ డోసులు పంపిణీ చేశారు.
India reports 3,33,533 new COVID cases (4,171 less than yesterday), 525 deaths, and 2,59,168 recoveries in the last 24 hours
Active case: 21,87,205
Daily positivity rate: 17.78%) pic.twitter.com/h8Hmvjwqsj— ANI (@ANI) January 23, 2022
ఇప్పటివరకూ 71.34 కోట్ల కరోనా టెస్టులు (Covid 19 Tests) చేయగా.. గడిచిన 24 గంటల్లో 19,60,954 టెస్టులు చేశారు. ఇప్పటివరకూ కరోనా (Covid 19 Cases) కారణంగా అత్యధికంగా మహారాష్ట్రలో 1,42,701 కేరళలో 51,739 కర్ణాటకలో 37,178 తమిళనాడులో 25,586 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన మరణాల్లో 14 రాష్ట్రాల్లో 10కి పైగా మరణాలు నమోదయ్యాయి.
Also Read: Mahesh Babu: సోదరుడు రమేష్ బాబు పెద్దకర్మకు మహేష్.. కన్నీటిపర్యంతమైన సూపర్ స్టార్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook