Railway Concessions: కరోనా మహమ్మారి సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీని తొలగించింది. ఇక అప్పట్నించి తిరిగి పునరుద్ధరించలేదు. సీనియర్ సిటిజన్లు చాలాకాలంగా రైల్వే టికెట్లలో రాయితీ కొనసాగించాలని కోరుతున్నా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు త్వరలో ఈ విషయంలో కీలక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రైల్వేలో మహిళా సీనియర్ సిటిజన్లకు 50 శాతం రాయితీ, పురుష, ట్రాన్స్‌జెండర్ సీనియర్లకు 40 శాతం టికెట్‌లో రాయితీ లభించేది. కానీ 2020 మార్చ్ నెలలో కరోనా కారణంతో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చిన రాయితీని తొలగించింది. దాంతో అప్పట్నించి సీనియర్ సిటిజన్లతో సహా అందరికీ ఒకే టికెట్ కొనసాగుతోంది. రైల్వే నిబంధనల ప్రకారం పురుషుల్లో 60 ఏళ్లు, మహిళల్లో 58 ఏళ్లు దాటితే సీనియర్ సిటిజన్లుగా పరిగణించేవారు. దాదాపు అన్ని రైళ్లలో సీనియర్ సిటిజన్లకు 40-50 శాతం డిస్కౌంట్ లభించేది. అయితే కరోనా సమయంలో ఈ రాయితీని తొలగించాక రైల్వేకు అదనపు ఆదాయం లభిస్తూ వస్తోంది. దాంతో కరోనా మహమ్మారి ముగిసినా రాయితీని మాత్రం పునరుద్దరించలేదు. 


రాయితీని తొలగించిన తరువాత భారతీయ రైల్వే 8 కోట్ల మంది సీనియర్ సిటిజన్ల నుంచి 5,062 కోట్ల ఆదాయం పొందింది. ఇందులో రాయితీ లేకపోవడం వల్ల అదనంగా కలిగిన ఆదాయం 2,242 కోట్లు. వీరిలో 4.6 కోట్ల మంది పురుషులు కాగా, 3.3 కోట్ల మంది మహిళలున్నాయి. 18 వేలమంది ట్రాన్స్‌జెండర్లున్నారు. ఇక అప్పట్నించి రైల్వే టికెట్లలో సీనియర్ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించాలనే డిమాండ్ క్రమంగా విన్పిస్తోంది. ఇదే విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 2022లో పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. కానీ రాయితీని పునరుద్ధరిస్తే రైల్వేపై అదనపు భారం పడనుంది. ఇండియన్ రైల్వేస్ ఇప్పటికే ప్రతి రైలు ప్రయాణీకుడికి 53 శాతం రాయితీ ఇస్తోందని 2019-20 సమయంలో 59,837 కోట్ల సబ్సిడీ పాసెంజర్ టికెట్లపై ఇచ్చామని కూడా రైల్వే మంత్రి తెలిపారు. 


ఇప్పుడు త్వరలో సీనియర్ సిటిజన్లకు రైల్వే టికెట్లలో రాయితీ పునరుద్ఱరణపై రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రాయితీ టికెట్లపై ప్రకటన చేయవచ్చని సమాచారం. 


Also read: Germany Jobs: బ్లూ కార్డ్ పాలసీలో మార్పులు, డిగ్రీ లేకుండానే ఇండియన్స్‌కు జర్మనీలో ఉద్యోగాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.