Pension and Gratuity Updates in Telugu: మీరు రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అయుంటే ఈ వివరాలు మీ కోసమే. ఎందుకంటే పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన అప్‌డేట్స్ వెలువడ్డాయి. పెన్షన్, గ్రాట్యుటీ పొందేందుకు ఎవరెవరికి అర్హత ఉంది, ఎవరికి లేదనే విషయంలో స్పష్టత వచ్చేసింది. పెన్షన్, గ్రాట్యుటీ అర్హతకు సంబంధించి కొత్త నిబంధనలు ఇలా ఉన్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయినప్పుడు రెండు విషయాలు కీలకంగా ఉంటాయి. ఇందులో ఒకటి పెన్షన్ అయితే మరొకటి గ్రాట్యుటీ. ఈ రెండింటికీ సంబంధించిన నిబంధనలు, మార్గ దర్శకాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం చాలా అవసరం. పెన్షన్, గ్రాట్యుటీ పొందేందుకు వివిధ సేవాకాలాలను ఎలా లెక్కించాలనేది ఈ మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉంటుంది. ఇవి సీసీఎస్ పెన్షన్ రూల్స్ 2021 ప్రకారం ఆఫీస్ మెమోరాండంలో ఉన్నాయి. వీటిలో 13వ నెంబర్ నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ సేవలో అందించిన సర్వీస్ వ్యవధి పెన్షన్‌కు అర్హతగా పరిగణిస్తారు. అటానమస్ బాడీలో లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పనిచేసిన ఉద్యోగులు పెన్షన్ , గ్రాట్యుటీకి సంబంధించి రూల్ నెంబర్ 14 ప్రకారం లెక్కించుకోవచ్చు. 18వ నిబంధన అయితే కాంట్రాక్ట్ సర్వీస్‌కు సంబంధించి ఉంటుంది. అదే ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో తిరిగి చేరితే గతంలోని సర్వీస్ వ్యవధిని రూల్ నెంబర్ 19 ప్రకారం లెక్కిస్తారు. ఇది సాధారణంగా సైనిక సేవల్లో పనిచేసి రిటైర్మెంట్ తరువాత ఇతర ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారికోసం ఉదహరిస్తుంటారు. 


ఇక రూల్ నెంబర్ 24 ప్రకారం ఉద్యోగుల సెలవు కాలాన్ని ఆర్జిత సేవలో భాగంగా పరిగణిస్తారు. శిక్షణలో ఉన్న కాలాన్ని  రూల్ నెంబర్ 22 ప్రకారం పెన్షన్ , గ్రాట్యుటీకు అర్హతలో లెక్కించాలి.


ఇవి కాకుండా రూల్ నెంబర్ 23, 27, 28 ప్రకారం కూడా లెక్కిస్తారు. ఇక అంతర్జాతీయ సంస్థలు ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్ వంటి సంస్థలకు ప్రతినిధిగా వెళ్లి ఉంటే ఆ కాలాన్ని రూల్ నెంబర్ 29 ప్రకారం పెన్షన్‌కు అర్హతగా భావిస్తారు. అయితే సంబంధిత శాఖలు ఈ సర్వీసు కాలాన్ని ధృవీకరించాల్సి ఉంటుంది. 


Also read: DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, మళ్లీ పెరగనున్న డీఏ ఎంత ఎప్పటి నుంచి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.