DA Hike News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, మళ్లీ పెరగనున్న డీఏ ఎంత ఎప్పటి నుంచి

7th Pay Commission DA Hike News in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మరోసారి పెరగనుంది. ఏడాదిలో రెండోసారి డీఏ-డీఆర్ పెంపు గత నెలలోనే జరిగింది. ఇప్పుడు మరోసారి పెరగనుంది. కేవలం మరో 2 నెలల్లో డీఏ పెరగనుంది. దీనికి సంబంధించన అప్‌డేట్స్ వెలువడ్డాయి. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం.

7th Pay Commission DA Hike News in Telugu: ఈ ఏడాది జూన్ నుంచి డిసెంబర్ వరకూ జారీ అయ్యే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా మరో రెండు నెలల్లో అంటే జనవరి 2025లో పెరిగే డీఏ ఎంతనేది నిర్ణయిస్తారు. జూలైలో ఇండెక్స్ 142.7 పాయింట్లు ఉంటే ఆగస్టులో 142.6 పాయింట్లుగా ఉంది. సెప్టెంబర్ నాటికి ఇది మళ్లీ 143.3 పాయింట్లకు చేరుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 53 శాతం డీఏ వస్తోంది. 

1 /5

మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం 2025 ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చని తెలుస్తోంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం దాదాపుగా రెట్టింపు కానుంది. అటు పెన్షన్ కూడా రెట్టింపు అవుతుంది.

2 /5

గత ఆరు నెలల్లో డీఏ 3 శాతం పెరగగా ఈసారి జనవరి 2025లో డీఏ 4 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. ఏఐసీపీఐ ఇండెక్స్ పెరుగుతుండటం ఇందుకు ఉదాహరణ. 

3 /5

జూన్ నుంచి డిసెంబర్ 2024 వరకూ ఉండే ఏఐసీపీఐ ఇండెక్స్ ఆధారంగా జనవరి 2025లో డీఏ ఎంతనేది ఉంటుంది. ప్రస్తుతం ఇండెక్స్ పెరుగుతోంది. ఈ సూచీ ఆధారంగా డీఏ ఇప్పటి వరకూ 54 శాతానికి చేరుకోవల్సి ఉంది. ప్రస్తుతం అందుకుంటున్న 53 శాతానికి అదనంగా 1 శాతం పెరిగింది. డిసెంబర్ నాటికి ఇది మరో 2-3 శాతం పెరగవచ్చు. 

4 /5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్, డియర్‌నెస్ రిలీఫ్ ఏడాదిలో రెండుసార్లు పెరుగుతుంటుంది. అందుకే 2025 జనవరి డీఏ-డీఆర్ పెంపుకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. 

5 /5

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు మరో శుభవార్త వచ్చింది. మరో రెండు నెలల్లో డీఏ, డీఆర్ పెరగనుంది. డీఏ, డీఆర్ ఎప్పుడైతే పెరుగుతాయో జీతాలు, పెన్షన్ కూడా భారీగా పెరగనున్నాయి.