సోషల్ మీడియా..ఇది సామ్యుడి చేతికి ఆయుధం లాంటిది. ఇది రెండువైపులా పదును గల కత్తుల్లాంటిది. దీంతో సమాజానికి వాటితో చైతన్యం కలిగించొచ్చు..కల్పిత కథలతో అరాచకం సృష్టించొచ్చు. దీంతో సమాజానానికి మేలు జరిగితే ఓకే..కానీ చెడు జరిగితే ఎం చేయాలి.. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి.. ఇదే ప్రశ్న ప్రభుత్వ అధికారుల మదిలో మెదలుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రధాన భాగమైన ఫేస్ బుక్, వాట్సప్ ద్వారా షేర్ చేసిన పుకార్లు, వదంతుల కారణంగా హింస చెలరేగడం, మూకుమ్మడి దాడులు జరగడం వంటి ఘటనలు చోటు చేసుకున్న ఘటనలు మనం తరుచూ చూస్తున్నాం. ముఖ్యంగా కశ్మీర్‌లాంటి సమస్యల్లో సామాజిక మాధ్యమాలు హింసను ఎగదోసేందుకు ఇవి ప్రధాన ఆయుధాలుగా మారుతున్నాయి.


మరోవైపు ఐసీఎస్ లాంటి అరాచక భావ వ్యాప్తి కోసం ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వాట్సప్, ఫేస్‌బుక్‌లను బ్లాక్ చేసే మార్గం ఏదైనా ఉన్నదా ? అని ప్రభుత్వం టెలికం ఆపరేటర్లను వాకబు చేసినట్లు తెలిసింది. జాతీయ భద్రతను కాపాడే  క్రమంలో దీన్ని కంట్రోల్ చేసే మార్గం తప్పక ఉండాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.