Children Vaccination: చిన్నారులకు టీకా.. మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం! ఆధార్ లేకుంటే..!!
జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది.
Central Govt issued guidelines for Covid vaccination of children between 15-18 years: ప్రపంచ దేశాలను కరోనా వైరస్ (Coronavirus) మహమ్మారి మరోసారి వణికిస్తున్న విషయం తెలిసిందే. భారత దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) వాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇందులో భాగంగా 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు (Children Between 15-18 Years) కరోనా టీకా (Covid Vaccination)కు కేంద్రం పచ్చజెండా ఊపింది. వీరితో పాటు ఆరోగ్య సంరక్షణ, ఫ్రంట్‌లైన్ కార్మికులకు ముందు జాగ్రత్త టీకా.. ఇతర వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు దాటిన జనాభా కోసం సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది.
జనవరి 3 నుంచి 15-18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ చేయనున్నట్టు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. టీకా కోసం జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. కోవాక్సిన్ మాత్రమే పిల్లలకు అందుబాటులో ఉంటుంది. పిల్లలకు ఆధార్ కార్డ్‌లు లేకపోయినా టీకా వేయించుకునే సదుపాయం ఉంది. ఆధార్ కార్డ్‌లు లేని చిన్నారులు తమ ఐడీ కార్డ్‌ల సాయంతో కొవిన్ (COWIN) పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎలిజబిలిటీ ఉన్న ప్రతి చిన్నారి టీకా వేసుకోవాలి చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ కోరారు. కరోనా కొత్త వేరియెంట్ నుంచి తప్పించుకోవాలంటే టీకా తప్పనిసరి అన్నారు.
Also Read: Team India's Lunch Menu Goes Viral : మ్యాచ్ రద్దు.. టీమిండియా లంచ్ మెనూ వైరల్..
ప్రికాషన్ డోస్ మార్గదర్శకాలపై డాక్టర్ ఆర్ఎస్ శర్మ మాట్లాడారు. రెండు డోసులు పొందిన ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు దాటిన ప్రజలకు జనవరి 10 నుంచి మరొక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ వేస్తామని ఆర్ఎస్ శర్మ చెప్పారు. '60 ఏళ్లు కంటే ఎక్కువ వయసున్నవారు రెండు డోస్‌లు తీసుకుని.. చివరి డోస్ నమోదు చేసుకున్న రోజు మధ్య గ్యాప్ 9 నెలల కంటే ఎక్కువ (39 వారాలు) ఉన్నవారు ప్రికాషన్ డోసుకు అర్హులు. పేరు నమోదు చేసుకున్నప్పుడు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా లేదా అని అడుగుతుంది. అవును అనే ఆప్షన్ ఎంచుకుంటే.. వ్యాక్సినేషన్ కేంద్రంలో రిజిస్టర్డ్ డాక్టర్ నుంచి సర్టిఫికేట్‌ను బుక్ చేసుకోవాలి. ఆపై టీకా తీసుకోవచ్చు' అని శర్మ పేర్కొన్నారు.
2021 జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ (Covid Vaccination) ప్రక్రియ ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 141 కోట్ల డోసుల్ని పంపిణీ చేసినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. దేశ జనాభాలో 61శాతం మందికి పూర్తిస్థాయి టీకాలు, 90 శాతానికి పైగా ఒక డోసు తీసుకున్నట్టు నివేదికలో పేర్కొంది. మూడు రోజుల కిందట జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi).. పిల్లలకు టీకాలు ఇవ్వడమనే ప్రయత్నం ద్వారా పాఠశాలల్లో బోధన సాధారణ స్థితికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 18 లక్షల ఐసోలేషన్ పడకలు, 5 లక్షల ఆక్సిజన్ బెడ్స్ ఉన్నట్టు తెలిపారు. వదంతుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు.
Also Read: Omicron Scare: రాష్ట్రంలో మరో 12 మందికి ఒమిక్రాన్ పాజిటివ్- 55కు చేరిన మొత్తం కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook