Central employees: సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్ని 100 శాతం ఉద్యోగులతో పని చేయనున్నాయి. దేశంలో కరోనా పరిస్థితలు క్రమంగా మెరుగవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఉద్యోగులను పూర్తి స్థాయిలో ఆఫీసుల నుంచే పని చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు జితేంద్ర సింగ్​.


అన్ని స్థాయిల్లో ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి.


ఇక ఉద్యోగులు ఫీసులకు వచ్చినా.. అందరూ తప్పకుండా ఫేస్​ మాస్క్ ధరించడం, కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడటం ఉన్నతాధికారుల బాధ్యతే అని స్పష్టం చేశారు జితేంద్ర సింగ్.


ఫిబ్రవరి 15 వరకు అనుకున్నా..


కరోనా మూడో దశ కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో జనవరి 3న 50 శాతం ఉద్యోగులు ఇంటినుంచి మిగతా వారు ఆఫీసుల్లో పని చేసేలా వెసులబాటు ఇచ్చింది ప్రభుత్వం. ఫిబ్రవరి 15 వరకు ఈ అవకాశం కల్పించాలని నిర్ణయించింది.


అయితే కొవిడ్ పరిస్థితులు అనుకున్నదానికంటే వేగంగా మెరుగవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 7 నుంచే పూర్తి స్థాయిలో ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సి ఉంటుందని తెలిపింది. ఇందుకు సంబంధించి అన్ని శాఖలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.


దేశంలో తాజా కొవిడ్ పరిస్థితి ఇలా..


దేశంలో తాజాగా 1,07,474 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీనితో ఇప్పటి వరకు కొవిడ్ సోకిన వారి సంఖ్య 4,21,88,138కి చేరింది.


ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12,25,011 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. కొవిడ్​ కారణంగా ఒక్క రోజులో తాజాగా 865 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు 5,01,979 మంది మహమ్మారికి బలయ్యారు.


Also read: India Covid-19 Update: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు, పెరిగిన మరణాలు


Also read: Sputnik Light: సింగిల్​ డోసు టీకా స్పుత్నిక్ లైట్​ వినియోగానికి భారత్ ఓకే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook