ఆ ఉద్యోగాలన్నింటికీ మంగళం పాడనున్న కేంద్రం
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఐదేళ్ళుగా ఉన్న పోస్టులన్నింటికీ మంగళం పాడనుంది.
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఐదేళ్ళుగా ఉన్న పోస్టులన్నింటికీ మంగళం పాడనుంది. ఈ మేరకు కేంద్రం అన్ని మంత్రిత్వ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసి.. ఇందుకు సంబంధించి సమగ్ర సమాచారం అందజేయాలని తెలిపింది. ఉద్యోగాల రద్దుపై కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ శాఖలవారీగా అందరికీ ఆదేశాలు జారీచేసిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గతంలోనే ఐదేళ్ళుగా భర్తీకానీ ఉద్యోగాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రం ఇదివరకే చెప్పింది. కొన్ని మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన నివేదికలు సంతృప్తిని ఇచ్చాయి. మరికొన్ని మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన నివేదికలు సమగ్రంగా లేవు. ఈ నేపథ్యంలోనే తాజాగా జనవరి 16, 2018న సంబంధిత మెమొరాండం జారీ చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. ప్రాథమిక అంచనా ప్రకారం ఐదేళ్ళు, అంతకంటే ఎక్కువ ఏళ్లుగా వేల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు.