India Bans Wheat Exports: గోధుమ ఎగుమతులపై కేంద్రం నిషేధం... ఎందుకీ నిర్ణయం... కారణాలివే...
India Bans Wheat Exports: విదేశాలకు గోధుమల ఎగుమతులపై కేంద్ర సర్కార్ నిషేధం ప్రకటించింది. భారత్‌తో పాటు పొరుగు దేశాల ఆహార భద్రత రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
India Bans Wheat Exports: అంతర్జాతీయంగా 'గోధుమ' కొరత ఏర్పడటం... గ్లోబల్ మార్కెట్‌లో గోధుమ ధరలు పైపైకి ఎగబాకుతుండటంతో.. దాని ప్రభావం భారత్‌పై కూడా పడుతోంది. ఇప్పటికే దేశంలో గోధుమ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి. మరోవైపు, దేశంలో గోధుమ పంట దిగుబడి కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో పండిన గోధుమలు ఎగుమతుల రూపంలో గ్లోబల్ మార్కెట్‌కి తరలితే భారత్‌లో ఆహార భద్రత సంక్షోభంలో పడుతుంది. ఈ నేపథ్యంలో ముందుగానే అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై నిషేధం విధించింది. తక్షణమే ఇది అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు డైరెక్టోరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా ఉత్తర్వుల్లో గోధుమ ఎగుమతులపై నిషేధానికి సంబంధించి కేంద్రం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడేనాటికి లెటర్ ఆఫ్ క్రెడిట్‌పై జరిగిన ఒప్పందాల మేరకు ఎగుమతులకు అనుమతి ఉంటుందని పేర్కొంది. అలాగే, ఇతర దేశాల ఆహార భద్రతా అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి మేరకు, ఆయా దేశాల విజ్ఞప్తి మేరకు గోధుమల ఎగుమతులకు అనుమతి ఉంటుందని తెలిపింది.
ఆల్ టైమ్ రికార్డు స్థాయికి గోధుమ ధర :
దేశంలో గోధుమ ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రిటైల్ మార్కెట్‌లో సగటున కిలో గోధుమల ధర రూ.32.38కి చేరింది. గతేడాదితో పోలిస్తే గోధుమ ధర 9.15 శాతం మేర పెరిగింది. 2010 తర్వాత ఈ స్థాయిలో గోధుమ ధరలు పెరగడం ఇదే తొలిసారి. పెరిగిన ధరలతో దేశంలో అత్యధికంగా పోర్ట్ బ్లెయిర్‌లో కిలో గోధుమల ధర రూ.59కి చేరింది.
కేంద్రం నిర్ణయానికి కారణాలివే.. :
దేశంలో ఈ ఏడాది గోధుమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఇప్పటికే ఉన్న గోధుమ నిల్వలు కూడా తగ్గాయి. గ్లోబల్ మార్కెట్‌లో మొత్తం గోధుమ ఉత్పత్తుల్లో 25 శాతం మేర ఎగుమతి చేసే రష్యా-ఉక్రెయిన్‌లు యుద్దంలో మునిగిపోవడంతో అక్కడి నుంచి సప్లై నిలిచిపోయింది. దీంతో గోధుమల కోసం రష్యా, ఉక్రెయిన్‌పై ఆధారపడిన దేశాలు కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలో గోధుమల ఉత్పత్తిలో రెండో స్థానంలో నిలిచిన భారత్ వైపు ఆ దేశాలు చూస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో గోధుమ ఉత్పత్తులు గ్లోబల్ మార్కెట్‌కి తరలితే దేశంలో ఆహార భద్రత సంక్షోభంలో పడుతుంది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా కేంద్రం గోధుమల ఎగుమతులపై నిషేధం ప్రకటించింది.
[[{"fid":"231237","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also Read: iPhone 15 Type C: Apple కొత్త మోడల్ iPhone 15లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్!
Also Read: Chandrababu Naidu: కుప్పం పర్యటనలో జూ.ఎన్టీఆర్ అభిమానిపై ఫైర్ అయిన చంద్రబాబు నాయుడు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.