iPhone 15 Type C: Apple కొత్త మోడల్ iPhone 15లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్!

iPhone 15 Type C: Apple iPhone ప్రియులకు ముఖ్య గమనిక! 2023లో అందుబాటులోకి రానున్న ఐఫోన్ 15 మోడల్ లో తీవ్ర మార్పులు చేయనున్నారని సమాచారం. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ను తొలగించి.. దాని స్థానంలో USB టైప్-సి ని ఫిక్స్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 14, 2022, 02:43 PM IST
iPhone 15 Type C: Apple కొత్త మోడల్ iPhone 15లో USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్!

iPhone 15 Type C: స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో Apple iPhoneకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రపంచంలో iPhone బ్రాండ్ తెలియని వారు లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఈ బ్రాండ్ నుంచి రిలీజయ్యే ప్రతి మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. Apple నుంచి ప్రతి ఏడాది కొత్త మోడల్‌ విడుదలవుతుంది. వాటి కోసం గాడ్జెట్ ప్రియులెందరో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. 

అయితే ఈ ఏడాది iPhone 14 మోడల్ ను Apple విడుదల చేయనున్నట్లు సమాచారం. దీంతో పాటు 2023లో విడుదల కానున్న iPhone 15 గురించి కూడా అనేక ఫీచర్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ క్రమంలో ఐఫోన్ 15 గురించి బయటపడిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఐఫోన్ 15 గురించి బయటపడ్డ వివరాలు..

ఆపిల్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ల గురించి లాంచ్‌కు ముందు ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. అటువంటి పరిస్థితిలో లీక్స్, రూమర్ల ద్వారా మాత్రమే ఫోన్‌ల గురించి కొన్ని విషయాలు బయటకు వస్తాయి. వచ్చే ఏడాది అనగా 2023లో విడుదల కానున్న ఐఫోన్ 15 గురించి ఓ ఫీచర్ బయటకు పొక్కింది. 

ఈ మోడల్ లో ఐఫోన్ కు ఎప్పటి నుంచో వస్తున్న లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ ను తొలగించి.. దాని స్థానంలో USB Type-C పోర్ట్‌ ను అందుబాటులోకి తీసుకురానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం తయారీ దశలో ఉన్న యాపిల్ ఐఫోన్ 15.. ఛార్జింగ్ పోర్ట్ కోసం USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ ను డిజైన్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 

ALso Read: Vivo T1 5G Flipkart: కేవలం రూ.1,500 ధరకే Vivo T1 5G స్మార్ట్ ఫోన్ కొనేయండి!

Also Read: Samsung Galaxy M13: శాంసంగ్ నుంచి మరో బడ్జెట్ ఫోన్.. అతితక్కువ ధరకే Galaxy M13!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News