Sri Vijaya Puram: పోర్ట్ బ్లెయిర్ పేరును మార్చేసిన కేంద్రం.. ఇక నుంచి శ్రీ విజయపురం
Port Blair as Sri Vijaya Puram: పోర్ట్ బ్లెయిర్ ఇక నుంచి శ్రీ విజయపురంగా మారనుంది. కేంద్రం ప్రభుత్వం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. వలసవాద గుర్తులను చెరిపేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Port Blair as Sri Vijaya Puram: అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును "శ్రీ విజయపురం"గా మార్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో పేరు మార్చినట్లు తెలిపారు. పాత పేరుకు వలస వారసత్వం ఉండగా.. శ్రీ విజయ పురం సాధించిన విజయానికి ప్రతీక అని చెప్పారు. స్వాతంత్య్ర పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులది ప్రత్యేక పాత్ర అని కొనియాడారు.
“మన స్వాతంత్య్ర పోరాట చరిత్రలో అండమాన్ & నికోబార్ దీవులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకాదళ స్థావరంగా పనిచేసిన ద్వీప భూభాగం.. నేడు మన వ్యూహాత్మక, అభివృద్ధి ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా ఉంది” అని ఆయన అన్నారు. మన జాతీయ జెండాను నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదట ఇక్కడే ఎగురవేశారని.. వీర్ సావర్కర్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులు స్వతంత్ర దేశం కోసం పోరాడిన సెల్యులార్ జైలు కూడా ఇక్కడే ఉందన్నారు.
ఈస్టిండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ నావికాదళ అధికారి కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ గౌరవార్థం ఈ నగరానికి పేరు పెట్టారు. ఇక్కడ సెల్యులార్ జైలు నేషనల్ మెమోరియల్‌కు ప్రసిద్ధి చెందింది. ఈ జైలులోనే అనేకమంది స్వాతంత్య్ర సమరయోధులు, ఇతర దేశాల వ్యక్తులు బందీలుగా శిక్ష అనుభవించారు. వలసవాద గుర్తుల నుంచి సరికొత్త రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో కేంద్రం పోర్ట్ బ్లెయిర్‌ను శ్రీ విజయపురంగా నామకరణం చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.