Covid19 Alert: సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మరింత జాగ్రత్త అవసరం
Covid19 Alert: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా సంక్రమిస్తూనే ఉంది. పండుగల సీజన్ సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని పేర్కొనడం గమనార్హం.
Covid19 Alert: దేశంలో కరోనా మహమ్మారి ఇంకా సంక్రమిస్తూనే ఉంది. పండుగల సీజన్ సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని పేర్కొనడం గమనార్హం.
కరోనా సెకండ్ వేవ్(Corona Second Wave)ఉధృతి ఇంకా స్థిరంగా కొనసాగుతోంది. ఒక్కోరోజు కేసుల సంఖ్య పెరుగుతూ..ఒక్కోరోజు తగ్గుతూ కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలు వెల్లడించింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మధ్యలో ఉందని కేంద్రం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నా సరే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా పండుగల సీజన్ కావడంతో సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఒక్క కేరళ(Kerala) రాష్ట్రంలోనే దేశంలోని కేసుల్లో సగం కేసులున్నాయి. ప్రస్తుతం కేరళలో లక్షకు పైగా కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
మరోవైపు దేశంలో మరోసారి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత 24 గంటల్లో 46 వేల 164 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా..607 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకూ 4 లక్షల 36 వేల 365 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల 25 లక్షల 58 వేల 530కు చేరుకోగా..3 కోట్ల 17 లక్షల 88 వేల 440 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో గత 24 గంటల్లో 34 వేల 159 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3 లక్షల 33 వేల 725 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్కరోజులోనే కేరళలో 31 వేల 445 కేసులు నమోదయ్యాయి.
Also read: AP Corona Update: ఏపీలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా ఉధృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook