Amit sha on 2002 Gujarat Riots: ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు ఆప్తమిత్రులు. ఇప్పుడు బీజేపీ అగ్ర నేతలు. గత ఏనిమిదేళ్లుగా దేశాన్ని నడిపిస్తోంది మోడీ-షా ద్వయం. అటు బీజేపీని అత్యంత బలోపేతంగా మార్చేసింది. అయితే తన మిత్రుడు నరేంద్ర మోడీకి సంబంధించి సంచలన విషయాలు చెప్పారు అమిత్ షా. దాదాపు రెండు దశాబ్దాలుగా తనలో దాచుకున్న విషయాలను వెల్లడించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ గతంలో పడిన భాదను వివరించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల కేసులో అప్పడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీపై ఆరోపణలు వచ్చాయి. మోడీపై కేసు కూడా నమోదైంది. మోడీపై వచ్చిన ఆరోపణలపై గతంలో విచారణ జరిపిన సిట్.. మోడీకి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవంటూ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే సిట్ నివేదికపై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా నరేంద్ర మోడీకి క్లీన్ చిట్ ఇచ్చేసింది. సిట్ నివేదకను సమర్ధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో 19 ఏళ్ల తర్వాత గుజరాత్ అల్లర్లపై స్పందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. మోడీకి సుప్రీంకోర్టు క్లీని చిట్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. న్యాయం గెలిచిందని కామెంట్ చేశారు. ఈ సందర్భంగా తనపై ఆరోపణలు వచ్చినప్పుడు మోడీ ఎలా ఫీలయ్యారో చెప్పారు అమిత్ షా.


అల్లర్ల కేసులో వచ్చిన ఆరోపణలపై మోడీ ఎంతో బాధ పడ్డారని అమిత్ షా చెప్పారు. 19 ఏళ్ల పాటు మోడీ పడిన బాధను తాను దగ్గరి నుంచి చూశానని చెప్పారు. శివుడు తన గొంతులో విషాన్ని నింపుకున్నట్లుగా మోడీ.. ఈ బాధను అనుభవించారని అమిత్ షా తెలిపారు. ఈ కేసు గురించి గత 19 ఏళ్లలో మోడీ ఒక్కసారి కూడా మాట్లాడలేదన్నారు. తనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా.. కేసు కోర్టులో ఉండటంతో చట్టాలపై గౌరవం ఉన్న మోడీ ఎక్కడా స్పందించలేదన్నారు. మోడీ లాంటి వ్యక్తికే అది సాధ్యమన్నారు. 2002లో గుజారాత్ లో జరిగిన అల్లర్లపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేశారని అమిత్ షా చెప్పారు. కాని చివరకు న్యాయమే గెలిచిందన్నారు. సిట్‌ విచారణను తామెప్పుడు ప్రభావితం చేయలేదన్నారు. సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే సిట్ విచారణ జరిగిందని అమిత్ షా స్పష్టం చేశారు.


నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు రాహుల్ గాంధీ హాజరవుతున్న తీరును అమిత్ షా తప్పుపట్టారు. గతంలో సిట్ విచారణకు వచ్చినప్పుడు మోడీ ఎలాంటి హడావుడి చేయలేదన్నారు. కాని రాహుల్ గాంధీ మాత్రం ధర్నాలు చేపట్టాలని పార్టీ కేడర్ కు పిలుపు ఇచ్చారని విమర్శించారు. ఏం తప్పు చేయనప్పుడు విచారణకు రావడానికి భయం ఎందుకుని అమిత్ షా ప్రశ్నించారు. సిట్ విచారణ సమయంలో మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నా.. విచారణకు సహకరించారని చెప్పారు.


Read also: Municipal Commissioner Dies:  రైలు పట్టాలపై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ డెడ్ బాడీ... హత్యా? ఆత్మహత్యా?  


Read also: Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?    



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి