Municipal Commissioner Dies: రైలు పట్టాలపై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ డెడ్ బాడీ... హత్యా? ఆత్మహత్యా?

Municipal Commissioner Dies:  శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కలకలం రేగింది. పుట్టపుర్తి మున్సిపల్ కమిషనర్ మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది.ముని కుమార్ సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి

Written by - Srisailam | Last Updated : Jun 25, 2022, 12:28 PM IST
Municipal Commissioner Dies:  రైలు పట్టాలపై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ డెడ్ బాడీ... హత్యా? ఆత్మహత్యా?

Municipal Commissioner Dies:  శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో కలకలం రేగింది. పుట్టపుర్తి మున్సిపల్ కమిషనర్ మృతదేహం రైలు పట్టాలపై లభ్యమైంది.  రైలు కింద పడి మున్సిపల్ కమిషనర్ ముని కుమార్  ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు.  ముని కుమార్ సూసైడ్ ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా ఆయనను హత్య చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పుట్టపర్తిలో కలకలం రేపుతోంది.  మూడు నెలల క్రితం పుట్టపర్తికి డిప్యూటేషన్ పై మున్సిపల్ కమిషనర్‌గా వచ్చిన మునికుమార్ అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మునికుమార్ గతంలో కడప కార్పొరేషన్ కార్యాలయంలో సూపరిండెంట్ గా  పని చేశారు. మూడు నెలల క్రితమే ముని కుమార్ ను డిప్యూటేషన్ పై పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ గా  పంపించారు.పుట్టపర్తిలోనే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల కిందట కడపకు వచ్చారు మునికుమార్. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన అతను.. కడప శివారులోని రాయచోటి రైల్వేగేటు రైల్వే గేట్ దగ్గర రైలు పట్టాలపై విగతజీవిగా కనిపించాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు ప్రాథమికంగా విచారణ జరుపుతున్నారు.

Read also: Revanth Reddy: కేసీఆర్ లో కలవరం.. రేవంత్ రెడ్డి టీమ్ సంబురం! పీకే సర్వేలో ఏముంది?  

Read also: Covid Cases Updates: లక్షకు చేరువలో యాక్టివ్ కేసులు.. ఐదు నెలల గరిష్టం.. భారత్ లో  విజృంభిస్తున్న కొవిడ్ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News