Covid 19 Precaution Dose: దేశవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడినవారందరికీ ఏప్రిల్ 10 నుంచి ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేట్ కేంద్రాల ద్వారా వీటి పంపిణీ జరగనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా కొనసాగుతున్న ఉచిత ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అలాగే, 60 ఏళ్లు పైబడిన హెల్త్ కేర్ వర్కర్స్‌కి ప్రికాషన్ డోసు పంపిణీ కొనసాగుతుందని తెలిపింది. 18 ఏళ్లు పైబడినవారు.. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయినవారు ప్రికాషన్ డోసు తీసుకునేందుకు అర్హులు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన 2.4 కోట్ల మంది హెల్త్ కేర్ వర్కర్స్‌, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి ప్రికాషన్ డోసులు పంపిణీ చేశారు. అలాగే, ఇప్పటివరకూ 15 ఏళ్లు పైబడిన 96 శాతం మంది ఒక డోసు తీసుకోగా... 15 ఏళ్లు పైబడినవారిలో 83 శాతం మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 12-14 ఏళ్ల వారిలో 45 శాతం మంది తొలి డోసు తీసుకున్నారు.


ముంబైలో కరోనా కొత్త వేరియంట్ 'ఎక్స్‌ఈ'ని గుర్తించినట్లు వార్తలు వస్తుండటం... చైనా, యూకెల్లో కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు పంపిణీపై కేంద్రం ఫోకస్ చేసింది. కోవిడ్ వ్యాప్తి కట్టడికి వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్రం ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడుతూ వచ్చిన కేంద్రం ఇకనుంచి ప్రికాషన్ డోసు పంపిణీకి చర్యలు తీసుకోనుంది. 


Also Read: Stock Markets: మూడు రోజుల నష్టాలకు బ్రేక్​- బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాలు..


Also read: OnePlus new TV: మార్కెట్లోకి వన్​ప్లస్ కొత్త స్మార్ట్​టీవీ- ధర, ఫీచర్ల ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook