Centre Ordinance : కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate),సీబీఐ (Central Bureau of Investigation) డైరెక్టర్ల పదవీ కాలాన్నీ పొడగించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులు తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్సులతో ఇప్పటివరకూ రెండేళ్లుగా ఉన్న ఈడీ, సీబీఐ డైరెక్టర్ల పదవీ కాలం ఐదేళ్లకు పెరగనుంది. ఈ మేరకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (Amendment) ఆర్డినెన్స్ 2021, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (Amendment) ఆర్డినెన్స్, 2021లను కేంద్రం జారీ చేసింది. ఈ రెండు ఆర్డినెన్సులు తక్షణం అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (Amendment) ఆర్డినెన్స్ 2021 ప్రకారం క్లాజ్(ఏ) కింద కమిటీ సిఫార్సు మేరకు లిఖితపూర్వకంగా నమోదు చేయాల్సిన కారణాల కోసం, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డైరెక్టర్ నియామకం ప్రారంభంలో నిర్ణయించిన పదవీ కాలం ముగిసిన తర్వాత.. ఒకసారి ఒక ఏడాది వరకు పదవీ కాలాన్ని పొడగించవచ్చు. అలా మూడుసార్లు పొడగించేందుకు అవకాశం ఉంటుంది. పొడగించిన వ్యవధితో సహా మొత్తం పదవీ కాలం ఐదేళ్లకు మించకూడదు.


Also Read:LPG cylinder blasted: ఎల్పీజీ సిలిండర్ పేలి 17 మందికి గాయాలు, 5 ఇళ్లు ధ్వంసం


ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు లేనందునా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) ఆమోదం మేరకు ఆర్డినెన్స్ తీసుకొచ్చినట్లు కేంద్రం వెల్లడించింది.  నిజానికి 1997కు ముందు సీబీఐ డైరెక్టర్ పదవికి నిర్దిష్ట పదవీ కాలాన్ని పేర్కొనలేదు. వినీత్ నారాయణ్ కేసులో సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం కనీసం రెండేళ్లు ఉండాలని సుప్రీం కోర్టు తీర్పునివ్వడంతో... అప్పటినుంచి అది అమలవుతూ వస్తోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook