Congress on Petrol Diesel Excise Duty Cut: పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం... ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడం ద్వారా సామాన్యులకు కాస్త రిలీఫ్‌ ఇచ్చినట్లయింది. అయితే ఈ నిర్ణయం అంకెల గారడీతో ప్రజలను మోసగించడమే తప్ప మరొకటి కాదని ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తోంది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన కాసేపటికే... కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఈ నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశానికి ఇలాంటి 'జుమ్లాలు' అక్కర్లేదంటూ సెటైర్స్ వేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ప్రియమైన కేంద్ర ఆర్థిక మంత్రి గారు... మే 2014లో లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.9.48. 2014లో లీటర్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.3.56. నేడు (మే 21) లీటర్‌ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.27.90, లీటర్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.21.80. ఇప్పుడు పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.8 మేర, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.6 మేర తగ్గించారు. అంటే... లీటర్ పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.18.42 మేర పెంచి ఇప్పుడు రూ.8 మేర తగ్గించారు. లీటర్ డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని రూ.18.24 మేర పెంచి ఇప్పుడు రూ.6కి తగ్గించారు.' అంటూ రణదీప్ సూర్జేవాలా తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ లీటర్ పెట్రోల్‌పై ఇప్పుడది రూ.19.90గా ఉంటే... కాంగ్రెస్ హయాంలో రూ.9.48గా మాత్రమే ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో లీటర్ డీజిల్‌పై రూ.3.56గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీ ఇప్పుడు రూ.15.80గా ఉందన్నారు. ప్రజలను మభ్యపెట్టే అంకెల గారడీ దేశానికి అక్కర్లేదని... ఇలాంటి 'జుమ్లా'లు అవసరం లేదని విమర్శించారు. దేశానికి కావాల్సింది ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై ఉన్న ఎక్సైజ్ డ్యూటీని కాంగ్రెస్ హయాంలో ఉన్న ధరల స్థాయికి తీసుకెళ్లడమని పేర్కొన్నారు. ఇకనైనా ప్రజలను మోసగించడం ఆపి... వారికి ఉపశమనం ఇచ్చే చర్యలు తీసుకోవాలని కోరారు. 


కాగా, పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో లీటర్ పెట్రోల్‌పై రూ.9.5, లీటర్ డీజిల్‌పై రూ. 7 మేర తగ్గనుంది. 





Also Read: Petrol, Diesel Prices: వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీ తగ్గింపు


Also Read: CM Kcr Tour: ఢిల్లీలో బిజీ బిజీగా సీఎం కేసీఆర్..సర్వోదయ స్కూల్ సందర్శన..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook