CM Kcr Tour: త్వరలో కీలక పరిణామం..ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య..!

CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి మోతీబాగ్‌లోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 06:42 PM IST
  • కొనసాగుతున్న సీఎం కేసీఆర్ ఆలిండియా పర్యటన
  • ఢిల్లీలో సీఎం కేసీఆర్ టూర్
  • సర్వోదయ స్కూల్‌ను సందర్శించిన సీఎంలు
CM Kcr Tour: త్వరలో కీలక పరిణామం..ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య..!

CM Kcr Tour: తెలంగాణ సీఎం కేసీఆర్..ఆలిండియా పర్యటన కొనసాగుతోంది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
రాబోయే కాలంలో ఏం జరుగుతుందో అందరూ చూస్తారని చెప్పారు. దేశంలో సెన్సెషన్ జరగాలి, జరుగుతుందన్నారు. కేంద్రం తీసుకొస్తున్న కొత్త విద్యావిధానం ఏకపక్షంగా ఉందన్నారు. ఇప్పటికైనా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి మోతీబాగ్‌లోని సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. అక్కడి పరిస్థితిని స్వయంగా సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్ వివరించారు. స్కూల్‌ ప్రత్యేకతలు, విద్య, మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. అనంతరం విద్యాభివృద్ధిపై ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను సీఎం కేసీఆర్ తిలకించారు. పాఠశాల పరిశీలన అనంతరం మొహల్లా క్లినిక్‌లను సందర్శించారు. 

పాఠశాలకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు నామానాగేశ్వరరావు, సంతోష్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డితోపాటు ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్‌ వచ్చిన తర్వాత విద్యా విధానంలో పలు మార్పులు జరిగాయి. దేశానికి ఆదర్శంగా నిలిచేలా సంస్కరణాలు తీసుకొచ్చారు.

అంతకముందు సీఎం కేసీఆర్‌తో ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ భేటీ అయ్యారు. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి వచ్చిన ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ యేతర శక్తి రావాలని ఎస్పీ, టీఆర్ఎస్‌ పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ఈక్రమంలో ఇరువురి భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీపై సమర శంఖం పూరించిన సీఎం కేసీఆర్..మోదీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. 

ఢిల్లీలో పలు రాజకీయ పార్టీ నేతలు, ప్రముఖ ఆర్థిక వేత్తలతో భేటీ అవుతారు. మీడియా రంగానికి చెందిన వారితోనూ సమావేశంకానున్నారు.ప్రస్తుత రాజకీయ, ఆర్థిక పరిణామాలపై చర్చించనున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఏకం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ యేతర శక్తిగా ఎదగాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పలువురు జాతీయ నేతలతో సమావేశమైయ్యారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఈనెల 22న చండీఘడ్‌, 26న బెంగళూరు, 27న రాలేగావ్ సిద్ధి, 29,30 తేదీల్లో బెంగాల్‌, బీహార్‌ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 

టూర్‌లో ఆర్మీ అమరవీరుల కుటుంబాలను పరామర్శించనున్నారు. వ్యవసాయ చట్టాల రద్దు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలను ఓదార్చనున్నారు. 600 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది.  ఆయా రాష్ట్రాల్లో ముఖ్య నేతలతో మంతనాలు జరుపుతారని సీఎంవో అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కర్నాటక పర్యటనలో మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామితో సీఎం కేసీఆర్ భేటీకానున్నారు. 27న రాలేగావ్ సిద్ధికి వెళ్లనున్నారు. అక్కడ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. సీఎం వెంట ఎంపీలు సంతోష్‌కుమార్, రంజిత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే ఆనంద్‌తోపాటు ఇతరులు ఉన్నారు. మొత్తంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆ దిశగా పావులు కదుపుతున్నారు.  త్వరలో మరిన్ని పర్యటనలు ఉండనున్నట్లు తెలుస్తోంది.

Also read:Revanth Reddy:ప్రతి రైతుకు అండగా ఉంటాం..రచ్చబండలో రేవంత్‌రెడ్డి..!

Also read:Jagga Reddy Comments: తెలంగాణలో బిజినెస్ పాలన సాగుతోంది..జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x