న్యూఢిల్లీ : హయ్యర్ మిలిటరీ సర్వీస్ పే కోసం ఆర్మీ బలగాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా వినిపిస్తూ వస్తోన్న ఈ ప్రతిపాదనకు తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నో చెప్పడం ఆర్మీ బలగాలను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. పీటీఐ వెల్లడించిన ఓ కథనం ప్రకారం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు లక్ష మంది ఆర్మీ బలగాలపై ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అందులో 87,646 జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఉండగా 25,434 మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉన్నట్టు పీటీఐ పేర్కొంది. ఆర్మీ బలగాలు పీటీఐకి తెలిపిన వివరాల ప్రకారం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని ఆర్మీ బలగాలే అసంతృప్తి వ్యక్తంచేసినట్టు సమాచారం. 


ఆర్థిక శాఖ మరోసారి ఈ నిర్ణయాన్ని పునసమీక్షించుకోవాలని ఆర్మీ బలగాలు కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నట్టు పీటీఐ స్పష్టంచేసింది.