Chungreng Koren: సంవత్సరం కాలంగా మణిపూర్‌ రాష్ట్రం తగలపడిపోతోంది. ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియడం లేదు. కానీ అక్కడి ప్రజలు మాత్రం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది. అల్లర్లు, హింస చెలరేగుతుండడంతో స్థానికులు చావలేక బతకలేక ఉంటున్నారని కొన్ని జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం మణిపూర్‌లో జరుగుతున్న పరిణామాలపై మరో క్రీడాకారుడు గోడు వెళ్లబోసుకున్నాడు. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవాలని విజ్ఞప్తి చేశాడు. తమ ప్రజలు తిండి లేక, నీళ్లు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: KN Rajannna: జై పాకిస్థాన్‌ అనే కొడుకుల్ని కాల్చి చంపాలి: మంత్రి సంచలన వ్యాఖ్యలు


 


మణిపూర్‌కు చెందిన మార్షల్ ఆర్ట్స్‌ ఫైటర్‌ చంగరెంజ్‌ కొరెన్‌ అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు. తాజాగా మాట్రిక్స్‌ ఫైట్‌ నైట్‌ (ఎంఎఫ్‌ఎన్‌) ఈవెంట్‌లో చంగరెంజ్‌ చాంపియన్‌గా నిలిచాడు. బెల్ట్‌, ట్రోఫీ అందుకున్నా కూడా అతడు ఆనందంగా లేడు. తన సొంత రాష్ట్రం మణిపూర్‌లో ఉన్న పరిస్థితుల కారణంగా అతడు తన విజయాన్ని కూడా ఆనందించలేకపోయాడు. అనంతరం హోస్ట్‌ అతడి అభిప్రాయం అడగ్గా మైక్‌ తీసుకున్న చంగరెంజ్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ..  'మోడీజీ - దయచేసి ఒకసారి మణిపూర్ కి రండి. సంవత్సరం నుండి మణిపూర్ మంటల్లో కాలిపోతుంది. ప్రజలు చచ్చిపోతున్నారు. పిల్లలకు స్కూళ్లు లేవు.. చదువులు లేవు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి దొరక్క అల్లాడిపోతున్నారు. మీరు ఒకసారి మణిపూర్‌ని సందర్శిస్తే విద్వేషపు మంటలారిపోయి శాంతి వెల్లివిరుస్తుంది' అని రోదిస్తూ తెలిపాడు.

Also Read: Yousuf Pathan: రాజకీయాల్లోకి యూసుఫ్‌ పఠాన్‌.. మరి కాంగ్రెస్‌ అగ్ర నాయకుడికి చుక్కలు చూపిస్తాడా?


చంగరెంజ్‌ కొరెన్‌ మాటలు అందరినీ కలచివేస్తున్నాయి. అతడు మాట్లాడిన వీడియోను ప్రతిపక్షాలు పంచుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్‌ ఈ వీడియోను పంచుకుంటూ ప్రధాని మోదీని నిలదీశారు. దేశ విదేశాలు తిరగడానికి సమయం ఉంటుంది కానీ మణిపూర్‌ వెళ్లడానికి సమయం లేదా? అని ప్రశ్నించారు. కజిరంగా జాతీయ పార్క్‌లో ఏనుగులపై విహరించడానికి, సముద్ర గర్భంలో మునగడానికి సమయం ఉంటుంది కానీ మణిపూర్‌ పర్యటించడానికి లేదా? అని ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా చంగరెంజ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.


ఏడాదిగా మణిపూర్‌లో చల్లారని హింస
గత ఏడాది కాలంగా మణిపూర్‌లో హింస చెలరేగుతోంది. ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 వేల మంది గాయపడ్డారు. నాగాస్‌, కుకీస్‌ మధ్య ఏర్పడిన విబేధాలతో మణిపూర్‌లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు మణిపూర్‌ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ఇంతవరకు 'మణిపూర్‌' అనే పేరు ఎత్తలేదు. ఈశాన్య రాష్ట్రాల మంత్రిగా ఉన్న కిషన్‌ రెడ్డి అక్కడ ఇప్పటివరకు పర్యటించలేదు. దీంతో మణిపూర్‌లో ఆందోళనకర పరిస్థితులు చల్లారలేదు. కాగా అక్కడ జరుగుతున్న విషయాలు తెలియకుండా కేంద్రం ప్రసార మాధ్యమాలు, సోషల్‌ మీడియాపై ఆంక్షలు విధించిందనే ఆరోపణలు ఉన్నాయి. దీని ఫలితంగా అక్కడి పరిస్థితులు ప్రపంచానికి తెలియడం లేదు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook