Chandrababu Swearing Ceremony: విభజిత ఆంధ్రప్రదేశ్‌కు రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నాడు. బాధ్యతలు స్వీకరించే వేడుకకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు మొదలుకుని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తరలిరానున్నారు. ఈ మేరకు ఆయా నాయకుల పర్యటన ఖరారైంది. అయితే మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి చంద్రబాబు స్వాగతం పలుకుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. దీంతోపాటే పొరుగు రాష్ట్రం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానిస్తారా అనేది కూడా చర్చ జరుగుతోంది. తన శిష్యుడు రేవంత్‌ రెడ్డికి కూడా ఆహ్వానం దక్కుతుందా అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా నడుస్తోంది.
 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Chandrababu: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజే నిరుద్యోగులకు పండుగ.. తొలి సంతకం దానిపైనే


రాజకీయంగా వైఎస్‌ జగన్‌, చంద్రబాబు బద్ధ శత్రువులు. వీరిద్దరూ ఏనాడూ పరస్పరం గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోలేదు. సంప్రదాయాలను కూడా తుంగలో తొక్కిన పరిస్థితులు ఉన్నాయి. ఇన్నాళ్లు జగన్‌ పైచేయి సాధించగా.. ఇప్పుడు బాబు వంతు వచ్చింది. అయితే బాబు గతంలో మాదిరి వ్యవహరిస్తారా రాజకీయంగా హుందాగా వెళ్తారా అనేది చర్చ జరుగుతోంది. హుందాగా వ్యవహరిస్తే ప్రస్తుతం అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌కు ఆహ్వానం పంపాల్సిందే. ఆహ్వానం మన్నించి ప్రమాణస్వీకారనకి హాజరైతే జగన్‌ కూడా ప్రజాస్వామ్య సంప్రదాయాలను గౌరవించినట్టు ఉంటుంది. 

Also Read: Kesineni Nani: కేశినేని నాని రాజకీయాలకు గుడ్‌ బై.. తమ్ముడి చేతిలో ఓటమి తట్టుకోలేకనా?


కానీ బాబు, జగన్‌ మధ్య అలాంటి సంప్రదాయం ఊహించడం కలగా చెబుతున్నారు. ఒకవేళ చంద్రబాబు ఒక మెట్టు దిగి జగన్‌కు ఆహ్వానం పలికితే ఆయన వచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. జగన్‌ ఇప్పటికీ తన ఓటమిని అంగీకరించడం లేదు. సీఎంగా రాజీనామాను స్వయంగా వెళ్లి గవర్నర్‌కు ఇవ్వాల్సి ఉండగా.. ఇతరుల ద్వారా పంపించారు. ఇంతలా జగన్‌ మొండిగా ఉన్నారు. ఈ క్రమంలో బాబు ఆహ్వానం పంపితే వెళ్లే పరిస్థితులు ఏమాత్రం లేవు.


ఇక తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యంమంత్రి కేసీఆర్‌కు బాబు ఆహ్వానం పలుకుతారని తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్న మాట. పొరుగు రాష్ట్రం కావడం.. మాజీ ముఖ్యమంత్రి కావడంతో మర్యాదపూర్వకంగా చంద్రబాబు పిలిచే అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్‌, బాబు కూడా రాజకీయంగా బద్ధ శత్రువులు. కానీ రాజకీయంగా ఎంత కొట్లాడుకున్నా సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకున్న సందర్భాలు ఉన్నాయి. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానించగా నాడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ హాజరైన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2019లో జగన్‌ ప్రమాణస్వీకారానికి కూడా కేసీఆర్‌ వెళ్లారు. ఇప్పుడు చంద్రబాబు పిలిస్తే కేసీఆర్‌ వెళ్తారా లేదా? అనేది చర్చ జరుగుతోంది. 


అయితే పరిస్థితులు చూస్తుంటే కేసీఆర్‌, జగన్‌ ఇద్దరికీ ఆహ్వానాలు పంపినా కూడా వారు చంద్రబాబు ప్రమాణస్వీకారానికి హాజరకాకపోవచ్చు. వచ్చే మాట అటుంచి కేసీఆర్‌, జగన్‌కు చంద్రబాబుతో పడడం లేదు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై కేసీఆర్‌ ఉచ్చు బిగించగా.. నైపుణ్యాల కుంభకోణం కేసులో చంద్రబాబును జైలుకు పంపారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని చంద్రబాబు ఆహ్వానం పంపకపోవచ్చు. ఒకవేళ పంపినా కూడా కేసీఆర్‌, జగన్‌ ప్రమాణస్వీకారానికి రారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో ఈనెల 12వ తేదీన తెలియనుంది. కాగా తన గురువు చంద్రబాబు ప్రమాణస్వీకారానికి వచ్చే యోచనలో రేవంత్‌ రెడ్డి ఉన్నారు. పిలిస్తే వెళ్తానని ఇప్పటికే రేవంత్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter