కోల్ కతాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్టీ నిర్వహించిన బీజేపీయేతర పక్షాల ఐక్యతా ర్యాలీలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్లొన్నారు. ఈ సభలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు బెంగాలీ భాషలో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన ఈరోజు చారిత్రాత్మకమైన రోజని, విపక్షాల ఐక్యతకు గొప్ప వేదికను ఏర్పాటు చేసిన మమతా బెనర్జీకి కృతఙ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధాని మోడీ మాటలు తప్పితే చేతల మనిషికాదని విమర్శించారు. దేశ చరిత్రలో నరేంద్ర మోడీ పబ్లిసిటీ ప్రధానిగా నిలిచిపోతారని చంద్రబాబు ఎద్దేవ చేశారు. అయన హయంలో సీబీఐ నుంచి ఆర్బీఐ వరకు అన్ని ప్రధాన వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకుండా  ఏపీకి తీరని అన్యాయం చేశారని విమర్శలు సంధించారు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వం కోల్ కతాలో బీజేపీయేతర పక్షాల ఐక్యతా ర్యాలీలో ఎస్పీ, ఆర్జేడీ, ఆప్, ఎస్సీపీ, డీఎంకే, జేడీయు అధినేతలు పాల్గొన్నారు. ఈ సభకు  మద్దతు ప్రకటిచిన రాహుల్ గాంధీ..మల్లికార్జున ఖర్గేను తమ ప్రతినిధిగా పంపారు. ఈశాన్య రాష్టాలకు చెందిన పలు పార్టీల  నాయకులు సహా మొత్తం 20 పార్టీలకు చెందిన నేతలు సభకు హాజరుకావడం గమనార్హం. అయితే ఈ ర్యాలీ బీజేపీకి వ్యతిరేక గళం విప్పుతూ ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావన తీసుకొస్తున్న కేసీఆర్ హాజరుకాకపోవడం గమనార్హం.