Chandrayaan-3 Launch LIVE Updates: జాబిల్లిపై అన్వేషణ కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశించింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్‌ రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ ద్వారా నింగిలోకి దూసుకెళ్లింది. ఎల్‌వీఎం-3 ఎం4 నుంచి చంద్రయాన్ ఉపగ్రహం విజయవంతంగా విడిపోయింది. ఈ శాటిలైట్.. భూకక్షలో 24 రోజుల పాటు తిరగనుంది. ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్-3 ఆగస్టులో చందమామను చేరుకోనుంది. తొలి దశ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌ హర్షం వ్యక్తం చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రయోగం జరిగింది ఇలా..


ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ను మోసుకుని ఈ అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి  దూసుకెళ్లింది. సకాలంలో పేలోడ్‌ను మండించి తొలి రెండు దశలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. చంద్రుడి దిశగా వెళ్లేందుకు మధ్యాహ్నాం 02.42 గంటల సమయంలో మూడో దశ పేలోడ్‌ను మండించింది. 02.54 సమయంలో మూడో దశ ముగియడంతో చందమామ దిశగా ప్రయాణం ప్రారంభించినట్లు ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ప్రస్తుతం దాని గమనం సజావుగా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 


ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది..: మోదీ
చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లడానికి ముందే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థను కీర్తిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. యావత్ దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను చంద్రయాన్-3 మిషన్ మోసుకెళ్తుందని అన్నారు. భారత అంతరిక్ష రంగంలో ఈతేదీ (జూలై 14) ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఆ సందర్భంగా భారత శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలిపారు.  భవిష్యత్తులో జాబిల్లి జనావాసంగా మారొచ్చేమోనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మోదీ.. అక్కడి నుంచి ప్రయోగంపై దృష్టి సారించారు. 


Also Read: Chandrayaan 3: మరికొన్ని గంటల్లో నింగిలోకి 'చంద్రయాన్-3'.. అందరి చూపు మనవైపే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook