Chandrayaan 3 Updates: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్ ఇక లాంఛనం కానుంది. ఇప్పటికే చంద్రయాన్ 3 మిషన్ కీలకమైన అన్ని దశల్ని విజయవంతంగా దాటుకుని చంద్రునికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో నిలబడి లక్ష్యానికి చేరువలో ఉంది. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం చంద్రునిపై విజయవంతంగా అడుగుపెట్టనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూలై 14వ తేదీన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 ఒక్కొక్క దశనూ దాటుకుంటూ ఇప్పుడు జాబిల్లికి కేవలం 25 కిలోమీటర్ల దూరంలో చంద్రుని కక్ష్యలో తిరుగుతోంది. చంద్రునిపై ల్యాండ్ అయ్యే క్రమంలో ఇక అన్ని దశల్ని దాటేసింది. ఇక మిుగిలింది అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టడమే. మరో 72 గంటల్లో చంద్రయాన్ 3 సక్సెస్ అనే మాట వినేందుకు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదే జరిగితే యూఎస్, రష్యా, చైనా తరువాత ఈ ఘనత సాధించిన నాలుగోదేశం కానుంది ఇండియా. చంద్రయాన్ 3 మిషన్‌లో భాగమైన చివరి కీలకమైన దశను నిన్న రాత్రి 1.50 గంటలకు అత్యంత విజయవంతంగా దాటేసింది. అంటే చంద్రుని కక్ష్యలో దూరాన్ని మరింత తగ్గించుకునే దశ ఇది. చంద్రునిపై చేరే క్రమంలో ఒక్కొక్క దశనూ విజయవంతంగా దాటుకుంటూ వచ్చింది చంద్రయాన్ 3. 


రాత్రి 1.590 గంటలకు విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా డీ బూస్టింగ్ చేయడం ద్వారా చంద్రయాన్ 3 వేగం మరింత తగ్గించడంలో సఫలీకృతమైంది ఇస్రో. ఇప్పుడు జాబిల్లిపై అడుగుపెట్టేందుకు కేవలం 25 కిలోమీటర్ల దూరమే మిగిలుంది. ఈ డీ బూస్టింగ్ ప్రక్రియ ద్వారా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దిగువ కక్ష్యలోకి చేరుకుంది. కేవలం 25 కిలోమీటర్ల దూరంలో అత్యంత చేరువలో ఉంది. చంద్రయాన్ 3 ఇప్పుడు చంద్రుని కక్ష్యలో సూర్యోదయం కోసం ఎదురుచూడాల్సి ఉంది. చంద్రునిపై ఇప్పుడు రాత్రి సమయం. ఆగస్టు 23 తేదీన అక్కడ సూర్యోదయం ఉంటుంది. విక్రమ్ ల్యాండర్ సూర్యరశ్మి సహాయంతో మిషన్‌ను ముందుకు తీసుకెళ్లనుంది. సోలార్ ప్యానెల్స్ ఇందుకు ఉపయోగపడతాయి. ఈ మిషన్ లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ రానున్న 14 రోజులు తన పనులు నిర్వర్తిస్తుంది. 


ల్యాండింగ్ సమయంలో మిగిలున్న సవాళ్లు ఇవే


ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా చంద్రునిపై దిగడం అనేది చాలా సమస్యలు, ఇబ్బందులు, సవాళ్లతో కూడుకున్నదే. చంద్రుని ఉపరితలం గోతులు రాళ్లు, రప్పలతో నిండి ఉంటుంది. ఇలాంటి ఉపరితలంపై ల్యాండింగ్ అనేది ప్రమాదకరమే.  చంద్రునిపై ల్యాండింగ్ చివరి దశలో పరిస్థితులు మరింతగా వికటించవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో అంతరిక్షయానం నుచి గ్యాస్ వెలువడుతుంది. ఈ గ్యాస్ కారణంగా చంద్రుని ఉపరితలంపై పెద్దమొత్తంలో దుమ్ము ధూళి వ్యాపించి ఆన్‌బోర్డ్ కంప్యూటర్ సెన్సార్‌లకు నష్టం కల్గించవచ్చు.


మరోవైపు ల్యాండింగ్ సమయంలో పెద్దమొత్తంలో ఇంధనం అవసరమౌతుంది. దీనిద్వారా వ్యతిరేక దిశలో బలం ఉపయోగించి కిందకు దింపే వేగాన్ని తగ్గిస్తారు. ఇంత పెద్దమొత్తంలో ఇంధనంతో రాకెట్ ప్రయోగం అంటే ప్రమాదకరమే. చంద్రునిపై వాతావరణం భూమితో పోలిస్తే 8 రెట్లు తేలిగ్గా ఉండటం కూడా ల్యాండింగ్ కష్టాల్ని పెంచుతుంది. 


అందుకే గతంలో అంటే చంద్రయాన్ 2 వైఫల్యం నేర్పిన పాఠాలతో గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసుకుంది. చంద్రయాన్ 2 చంద్రునికి 2 కిలోమీటర్ల దూరంలో ఉందనగా వైఫల్యం చెందింది. ఈ మిషన్ క్రాష్ ల్యాండ్ అయింది. ల్యాండర్ సాంకేతికతలో మార్పులు చేశారు. విక్రమ్ ల్యాండర్ కాళ్లను పటిష్టం చేశారు. తద్వారా ఏదైనా పెద్ద గోతిలో ల్యాండ్ అయ్యే పరిస్థితి తలెత్తినా సమస్య కాకపోవచ్చు. 


Also read: IMD Weather Updates: రానున్న 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లోని ఈ జిల్లాలకు భారీ వర్షాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook