National Medical Commission Bill: వచ్చే సంవత్సరం జనవరిలో ఢిల్లీలోని AIIMS సహకారంతో నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించేందుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ సిద్ధమవుతోంది. ఈ మేరకు యూనివర్సిటీలకు సంకేతాలు ఇచ్చింది. MBBS చివరి సంవత్సరం స్టూడెంట్స్ నెక్స్ట్‌లో పాస్‌ అవ్వడం ద్వారా పీజీ NEET రాయాల్సిన అవసరం లేదని కేంద్రం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లులో తెలిపింది. ఈ మేరకు 15 మంది నిపుణులతో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు కానుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జిల్లా ఆస్పత్రుల్లో 3 నెలలపాటు ఇంటర్న్‌షిప్‌ చేయాలి:



ప్రస్తుతం MBBS చివరి సంవత్సరంలో ఉన్న స్టూడెంట్స్‌ ఇంటర్న్‌షిప్‌లో భాగంగా మొదటి మూడు నెలలు జిల్లా..ఇతర హాస్పిటళ్లల్లో తప్పనిసరిగా పనిచేసేలా నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ మార్గదర్శకాలను యూనివర్సిటీలకు పంపింది. ఈ మూడు నెలల్లోనూ స్టూడెంట్స్‌ ఏమేమి నేర్చుకోవాలో స్పష్టంగా తెలిపింది. జనరల్‌ మెడిసిన్‌, గైనకాలజీ, జనరల్‌ సర్జరీ విభాగాల్లో మెడికల్‌ స్టూడెంట్స్‌ పనిచేయాల్సి ఉంటుంది. మిగిలిన 9 మాసాల్లో ఇంటర్న్‌షిప్‌ ఎలా పూర్తి చేయాలో కూడా స్పష్టంగా తెలిపింది. ఈ ఏడాది కొత్తగాఆయుర్వేదం,  ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, టీబీ కేంద్రం, హోమియో, ల్యాబ్‌ల పనితీరుపైనా మెడికల్‌ స్టూడెంట్స్‌కు అవగాహన పెంచుకునేందుకు వీలుగా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. క్షేత్ర స్థాయిలో రోగులను చూడడం ద్వారా మరింత అనుభవం పెరుగుతుందని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ యోచిస్తోంది. ఇకపై చదివిన కాలేజీల్లోనే ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాలని నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ వెల్లడించింది.


నేషనల్‌ లెవల్‌లో ఎగ్జామ్స్‌:


నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహణకు ముందు హెల్త్‌ యూనివర్సిటీల ద్వారా MBBS మొదటి సంవత్సరం స్టూడెంట్స్‌కు జరిగే పరీక్షలను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ నిర్వహించే విషయాన్ని పరిశీలిస్తోంది. కొన్ని ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో విద్యా ప్రమాణాలు దిగజారిపోతున్నాయని భావిస్తున్నందున నేషనల్‌ లెవల్‌లో ఎగ్జామ్‌ నిర్వహణ ద్వారా మంచి రిజల్ట్స్‌ లభిస్తాయని ఆశిస్తుంది. ప్రాక్టికల్స్‌ వరకు యూనివర్సిటీల స్థాయిలో..ఎంపిక చేసిన సబ్జెక్టుల్లో ఎగ్జామ్స్‌ను నేషనల్‌ లెవల్‌లో నిర్వహించాలని భావిస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ  వస్తుందంటున్నారు.


షెడ్యూల్‌ ఖరారు:


2021-22లో MBBS మొదటి సంవత్సరంలో జాయిన్‌ అయిన స్టూడెంట్స్‌కు 2027 వరకు బోధన..ఎగ్జామ్స్‌ ఎలా జరగాలన్న దానిపై స్పష్టమైన షెడ్యూల్‌ను నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ప్రకటించింది. మొదటి ఏడాది స్టూడెంట్స్‌కు 2023 ఫిబ్రవరిలో వార్షిక పరీక్షలు జరుగుతాయి. 2024 మార్చిలో రెండోవ సంవత్సరం, 2025 జనవరి అఖరులో మూడోవ సంవత్సరం పార్టు-1, అదే సంవత్సరం ఫిబ్రవరిలో ఎలక్టివ్స్‌, 2026 మార్చిలో నాలుగో సంవత్సరం పార్టు-2 ఎగ్జామ్స్‌ జరుగుతాయి. ఇంటర్నెషిప్‌ 2026 మే 1 నుంచి ప్రారంభమై 2027 ఏప్రిల్‌ 30వ తేదీకి పూర్తి చేయాలి. నేషనల్‌ ఎగ్జిట్‌ ఎగ్జామ్‌ నిర్వహణ, కౌన్సెలింగ్‌ 2027 మే, జూన్‌లో జరుగుతుందని వెల్లడించింది. పీజీ స్టూడెంట్స్‌కు నూతన విద్యా సంవత్సరం జులై 2027 నుంచి ప్రారంభమవుతుంది. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ ధన్వంతరి చిహ్నంతో లోగోను సిద్ధం చేసింది.


 


Also Read: హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!


 


Also Read: Post Office Recruitment 2022: పోస్ట్ ఆఫీసుల్లో 38వేలకుపైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేయండి ఇలా..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook