హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!

Pooja Hegde about Hrithik Roshan. హృతిక్‌ రోషన్‌తో ఎలాగైనా ఫొటో తీయించుకోవాలని కెమెరాతో కోయీ మిల్‌గయా ప్రీమియర్‌ షోకు తాను వెళ్లానని, హృతిక్‌ స్టేజీ దిగి వెళ్లిపోవడంతో తన హృదయం ముక్కలైపోయిందని పూజా హెగ్డే అన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 3, 2022, 12:36 PM IST
  • హృతిక్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది
  • స్టార్ హీరోయిన్ ఆవేదన
  • పదేళ్ల తర్వాత హృతిక్‌ సరసన
హృతిక్‌ రోషన్‌ చేసిన పనికి నా హృదయం ముక్కలైపోయింది.. స్టార్ హీరోయిన్ ఆవేదన!

Pooja Hegde heart broken after Hrithik Roshan couldn't take a picture with her: ఎంతపెద్ద స్టార్ హీరో, హీరోయిన్ అయినా.. వారు కూడా ఒకప్పుడు మిగతా స్టార్లపై క్రష్ లేదా అభిమానంను కలిగే ఉంటారు. ఇప్పటికే పెద్దపెద్ద స్టార్లు తమ చిన్న వయసులో పలానా వాళ్లను ఇష్టపడ్డామని చెప్పారు. ఈ జాబితాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా ఉన్నారు. ఆమె 12 ఏళ్ల వయసులో ఉనప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌ రోషన్‌ను అభిమానించే వారట. హృతిక్‌ అంటే తనకు చాలా ఇస్తామని కూడా చెప్పారు. అయితే ఆయన చేసిన ఓ పనికి తాను చాలా బాదపడ్డానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా తెలిపారు. 

పూజా హెగ్డే స్కూల్‌ రోజుల్లో బాలీవుడ్‌ హీరో హృతిక్‌ రోషన్‌ను ఎంతగానో అభిమానించేదట. ఆయనతో కలిసి ఓ ఫొటో తీయించుకునేందుకు చాలాసార్లు ప్రయత్నాలు చేశారట. 2003లో వచ్చిన 'కోయీ మిల్‌గయా' సినిమా ప్రీమియర్‌ షోకు వెళ్లి నిరాశగా తిరిగొచ్ఛారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ... 'కోయీ మిల్‌గయా సినిమా టైమ్‌లో నా వయసు 12 ఏళ్లు. నేను అప్పుడు స్కోల్ చదువుతున్నా. హృతిక్‌ రోషన్‌ అంటే చాలా అభిమానం ఉండేది. చిన్నప్పటినుంచే ఆయనంటే పిచ్చి' అని తెలిపారు. 

'హృతిక్‌ రోషన్‌తో ఎలాగైనా ఫొటో తీయించుకోవాలని కెమెరాతో కోయీ మిల్‌గయా ప్రీమియర్‌ షోకు వెళ్లాను. హృతిక్‌ రోషన్‌ కనిపించగానే ఆనందపడిపోయా. ఫొటో కోసం ప్రయత్నిస్తుండగానే.. హృతిక్‌ స్టేజీ దిగి వెళ్లిపోయారు. దాంతో నా హృదయం ఒక్కసారిగా ముక్కలు అయిపోయింది. ఆపై ఆ సినిమా పోస్టర్‌ ఎక్కడ కనిపించినా చాలా బాధపడేదాన్ని. పదేళ్ల తర్వాత ఏకంగా హృతిక్‌ రోషన్‌తో కలిసి నటించే అవకాశం వచ్చింది. నా ఆనందానికి అవధులే లేవు. ఇదంతా ఓ అందమైన కలలా అనిపించింది' అని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు. హృతిక్‌ సరసన 'మొహంజొదారో' చిత్రంలో పూజా నటించిన విషయం తెలిసిందే. 

'ఒక లైలా కోసం' చిత్రంతో నాగ చైతన్య సరసన నటించిన పూజా హెగ్డే.. హీరోయిన్‌గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ముకుంద,  డీజే, సాక్ష్యం, అరవింద సమేత, మహర్షి, గద్దలకొండ గణేశ్‌, అలవైకుంఠ పురం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలు చేశారు. మొదటిలో పూజా కారీర్ అంతమాత్రంగానే ఉన్నా.. ఇటీవల జోరందుకుంది. అయితే తాజాగా నటించిన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు అంతగా ఆడలేదు.  

Also Read: IPL 2022 Umpiring: క్యాచ్ అయితే వైడ్ ఇచ్చాడు.. అతడికి ఉత్తమ అంపైరింగ్‌ అవార్డు ఇవ్వండి!

Also Read: Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలుచేయడానికి బదులుగా.. ఈ పనులు చేస్తే మంచిది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News