ప్రభుత్వం నిర్ణయం: ట్రాన్స్‌జెండర్లకూ పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగాలు
ట్రాన్స్జెండర్లన కూడా పోలీస్ ఫోర్స్‌లోకి తీసుకొంటున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది
రాయ్ పూర్: ట్రాన్స్‌జెండర్‌లను కూడా పోలీస్ ఫోర్స్‌లోకి తీసుకొంటున్నట్లు ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో దేశంలోనే ఈ నిర్ణయం తీసుకొన్న మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌ఘడ్ నిలిచింది. ప్రభుత్వ నిర్ణయంపై ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిక్రూట్ మెంట్ కోసం సిద్దమవుతున్నట్లు ఆశావహులు తెలిపారు.
'ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. టెస్టులన్నీ విజయవంతంగా పూర్తి చేసి రాష్ట్రసేవలో భాగస్వాములవుతాము. తమకు అందరూ సలహాలు, సూచనలు ఇచ్చి తాము సెలక్ట్ అయ్యేలా ఆశీర్వదించండి' అని ఆశావహులు కోరారు.