PAN-Aadhaar Linking: పాన్ కార్డ్, ఆధార్ అనుసంధానం చేసుకున్నారా, నేటితో ముగియనున్న డెడ్‌లైన్
PAN-Aadhaar Linking | ఎవరైనా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలని చూస్తే అందుకు ఆలస్య రుసుము లాంటివి చెల్లించాల్సి వస్తుంది. పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN), ఆధార్ కార్డ్ అనుసంధానానికి తుది గడువు మార్చి 31, 2021తో ముగియనుంది.
పర్మనెంట్ అకౌంట్ నెంబర్(PAN), ఆధార్ కార్డ్ అనుసంధానానికి తుది గడువు మార్చి 31, 2021తో ముగియనుంది. ఆ తరువాత ఎవరైనా పాన్, ఆధార్ లింకింగ్ చేసుకోవాలని చూస్తే అందుకు ఆలస్య రుసుము లాంటివి చెల్లించాల్సి వస్తుంది. గతంలో జూన్ 20, 2020తో తుది గడువు ముగియనుండగా, ఈ మార్చి 31 వరకు పొడిగించారు.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్ (CBDT) పాన్, ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోవాలని గత ఏడాది నోటిఫికేషన్ జారీ చేసింది. నిర్ణీత గడువులోగా అనుసంధానం చేసుకోకపోతే పాన్ కార్డ్ చెల్లుబాటు కాదని సైతం కొన్ని రిపోర్టులు వైరల్ అవుతున్నాయి. అయితే మీ ఆధార్, పాన్ కార్డ్ అనుసంధానం చేసుకున్నారా లేదా స్టేటస్ తెలుసుకోవాలంటే ఈ లింక్ (PAN Aadhaar Link Status) క్లిక్ చేయండి.
Also Read: Internet Speed: వినియోగదారులకు శుభవార్త చెప్పిన బీఎస్ఎన్ఎల్, ఇక 4G వేగంతో ఇంటర్నెట్
ఒకవేళ మీ పాన్ మరియు ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోకపోతే కింది విధానంలో ఆన్‌లైన్ ద్వారా లింక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు.
1. పాన్, ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకుకోవాలనుకుంటే ముందు ఇన్‌కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి
2. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్, పుట్టినతేదీ వివరాలతో ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి
3. అన్ని వివరాలు నమోదు చేసిన తరువాత కోడ్‌ను ఎంటర్ చేయాలి
Also Read: Gold Price Today 31 March 2021: మార్కెట్‌లో మళ్లీ పతనమైన బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు
4. లాగిన్ అయిన తరువాత ఓ పాపప్ విండో కనిపిస్తుంది. అందులో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అనుసంధానం చేసుకోవాలని ఉంటుంది.
5. ప్రొఫైల్ సెట్టింగ్స్‌కు వెళ్లి అందులో లింక్ ఆధార్ బటన్ మీద క్లిక్ చేయాలి
6. రిజిస్ట్రేషన్ సమయంలో నమోదు చేసిన మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్ వివరాలు నింపాలి.
7. స్క్రీన్ మీద కనిపిస్తున్న మీ వివరాలు, ఆధార్ కార్డ్ మీద ఉన్న వివరాలు నిర్ధారించుకోండి
8. మీ వివరాలు సరిపోలిన తరువాత ఆధార్ కార్డ్ నెంబర్ నమోదు చేసి ఆపై ‘లింక్ నౌ’ బటన్ మీద క్లిక్ చేయాలి
9. మీ ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్‌తో అనుసంధానం అయిందని మెస్సేజ్ వస్తుంది.
Also Read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మార్చి 31, 2021, ఓ రాశివారికి ధనవ్యయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook