Chennai Air Show Stampade: ఎయిర్‌షో విషాదం.. రైల్వేస్టేషాన్లో లక్షలమంది జనం.. తొక్కిసలాటలో ముగ్గురి మృతి..
Chennai Air Show Stampade Video: ఘోర విషాదం చోటుచేసుకుంది. చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో తొక్కిసలాట జరుగగా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన దాదాపు 230 మందికి పైగా గాయపడ్డారు.
Chennai Air Show Video: చెన్నై మెరీనా బీచ్ ఎయిర్ షోలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం బీచ్ వద్ద ఎయిర్ షో నిర్వహించగా చూడటానికి లక్షల మంది జనాలు వచ్చారు. దీంతో స్థానిక రైల్వే స్టేషన్ కిక్కిరిపోయింది. ఒక్కసారిగా తొక్కిసలాట జరగడంతో ముగ్గురు మృతిచెందారు. ఇందులో ఒకరు ఏపీకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు 230 మందికి పైగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
ఇదీ చదవండి: వైరల్ వీడియో.. వెయిటర్ జాబ్ కోసం పెద్ద క్యూ కట్టారు.. నిరుద్యోగం ఇంతలా ఉందా?
తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద జరిగిన ఎయిర్ షో ఆదివారం కావడంతో లక్షల మంది జనం చూడటానికి వచ్చారు. అయితే, షో ముగిసిన తర్వాత తిరిగి అందరూ వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. ప్లాట్‌ఫామ్‌పై లక్షల మంది జనం ఉండటంతో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. 230 మందికి పైగా గాయాలు అయ్యాయి. అయితే, వీరిని హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు కూడా ఒకరు ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో మృతిచెందినవారు శ్రీనివాసన్ (48), కార్తికేయన్ (34), జాన్ బాబు (56), దినేష్‌గా గుర్తించారు.
ఇదీ చదవండి: పండుగ ముందు జియో బిగ్ అప్‌గ్రేడ్.. రూ.1,029 రీఛార్జీ ప్లాన్‌తో ఇక అమెజాన్ ప్రైమ్ లైట్ ఉచితం..
చెన్నై మెరీనా బీచ్‌లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 92వ వార్షికోత్సవంలో భాగంగా అక్టోబర్ 6 ఆదివారం ఎయిర్ షో నిర్వహించారు. ఈ షో చూడటానికి దాదాపు 15 లక్షల మందికి పైగా వచ్చినట్లు సమాచారం. దీంతో అక్కడి నుంచి ఇళ్లకు తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. దగ్గర్లోని అన్ని మెట్రో స్టేషన్‌లలో లక్షల మంది జనం గుమిగూడారు. దీంతో అక్కడ తీవ్ర ఉక్కపోతకు కూడా గురయ్యారు. సొమ్మసిల్లి పడిపోయారు ఈ క్రమంలోనే ముగ్గురు ప్రాణాలు కూడా పోయాయి. ఆదివారం కావడంతో జనం పోటెత్తారు. ఇసుకెస్తే రాలనంత జనం మెరీనా బీచ్‌కు తరలివచ్చారు. అంతేకాదు రోడ్డపై కూడా వేల సంఖ్యలో వాహనాలు దర్శనమిచ్చాయి.
ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రారంభమైన ఎయిర్ షోలో రాఫెల్, తేజస్, ప్రచంద్, హెరిటేజ్ ఎయిర్ క్రాఫ్ట్ వంటి 72 విమానాలను ప్రదర్శించారు. ఈ ఎయిర్ షో చూడటానికి లక్షల మంది జనాలు రైళ్లు, కార్లు, బస్సుల ద్వారా చేరుకున్నారు. ఈ ఎయిర్ షో కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన తదితరులు కూడా పాల్గొన్నారు. అయితే, ఈ ఎయిర్ షో మధ్యాహ్నం ముగిసింది. కానీ, లక్షల మంది జనాలు ఒకేసారి గుమిగూడటంతో సాయంత్రం వరకు ఈ రద్దీ కొనసాగింది. ఈ విషాదానికి కారణం అయింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేయడానికి ఈ అతిపెద్ద షో నిర్వహించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.