ఈఏడాది ఏప్రిల్ లో ఆరు ఎస్బిఐ అనుబంధ బ్యాంకులను మాతృసంస్థ ఎస్బిఐ విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్ లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లు చెల్లవు. ఖాతాదారులు ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వెంటనే పాత చెక్ బుక్ లను మార్చుకోవాలని, కొత్త ఐఎఫ్ఎస్సీ కోడ్ లను తెలుసుకోవాలని సూచించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదివరకే ఎస్బిఐ పాత చెక్ బుక్ లను మార్చుకోవాలని సెప్టెంబర్ 30 వరకు గడువు పెట్టింది. ఆరువాత డిసెంబర్ 31 వరకు గడవు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గడువు దగ్గరకు పడుతుండటం, పట్టుమని నాలుగు రోజులు కూడా లేకుండటంతో ఎస్బిఐ మరో ప్రకటన చేసి ఖాతాదారులను అలర్ట్ చేసింది.  కొత్త చెక్ బుక్ లను పొందటానికి బ్యాంకు శాఖను సంప్రదించాలని (లేదా) ఎస్బిఐ మొబైల్ యాప్, ఏటీఎం ద్వారానైనా పొందవచ్చని పేర్కొనింది. 


కొత్త చెక్ బుక్ లు


భారతీయ మహిళా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంకు ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ట్రావెన్కోర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంకు ఆఫ్ రాయ్పుర్ బ్యాంకుల్లో ఖాతాదారులుగా ఉన్నవారు వెంటనే పాత చెక్ బుక్ ల స్థానంలో వాటికి బదులు కొత్త చెక్ బుక్ లను తీసుకోవాలని సూచించారు.