Bihar Govt Cancels School Teachers Leaves: బీహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఛత్ పూజ వేడుకలకు ముందు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల సెలవులను రద్దు చేస్తూ నిర్ణయించింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులందరికీ నవంబర్ 21 వరకు సెలవులు రద్దు చేస్తూ అదనపు ప్రధాన కార్యదర్శి సీఎస్ కేకే పాఠక్ జారీ చేసిన ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 19-20 మధ్య ఛత్ పూజ జరగాల్సి ఉండగా.. సెలవులను తగ్గించాలనే నిర్ణయం ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులలో ఆగ్రహం తెప్పిస్తోంది. ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి పండుగల సందర్భంగా అన్ని రకాల శిక్షణ కార్యక్రమాలను నిలిపివేసేందుకు అనుమతించాలని ఉపాధ్యాయ సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదనపు ప్రధాన కార్యదర్శి ఆదేశాలపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 13 నుంచి నవంబర్ 21 వరకు వారి సంబంధిత సంస్థల్లో పాఠశాల సిబ్బంది, ప్రత్యేకించి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని నోటిసుల్లో పేర్కొంది. ఈ సమయంలో ప్రధానోపాధ్యాయులు పాఠశాలల అభివృద్ధి కార్యక్రమాలలో నిమగ్నమవ్వాలని ప్రభుత్వం సూచించింది.  


పండుగల మధ్య కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులకు శిక్షణ షెడ్యూల్ చేయాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. బీహార్ రాష్ట్ర ఉపాధ్యాయుల సంఘం అధికారికంగా విద్యా శాఖకు లేఖ రాసింది. మతపరమైన, సాంస్కృతిక భావాలకు అనుగుణంగా ఈ షెడ్యూల్‌ను పునఃపరిశీలించాలని లేఖలో పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ నిర్ణయం కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులను పండుగ సమయంలో ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపింది.


బీహార్‌లో చాలా ఏళ్ల తర్వాత ఉపాధ్యాయుల నియామకం జరిగిందని.. కొత్తగా నియమితులైన చాలా మంది టీచర్లు ఉద్యోగం పొందిన తర్వాత ఛత్ పూజ జరుపుకోవాలని అనుకుంటున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. కాగా.. గతంలో సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వ పాఠశాలలకు సెలవులను విద్యాశాఖ తగ్గించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో 23 సెలవులు ఉండగా.. 11కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.


Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం


Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి