Chhattisgarh Elections Results 2023 in Telugu: మధ్యప్రదేశ్, రాజస్థాన్ తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ మెజారిటీ మార్కును దాటేసింది. 90 స్థానాలకు గానూ 50 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 38 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా, ఇతరులు 2 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ కాషాయ పార్టీ దూసుకుపోతుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 45 స్థానాల్లో గెలిస్తే చాలు. ప్రస్తుతం భాజాపా ఆ మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ పటాన్ అసెంబ్లీ స్థానం నుంచి వెనుకంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి విజయ్ బఘెల్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన గిరీష్ దేవాంగన్‌పై బీజేపీ అభ్యర్థి, మాజీ సీఎం రమణ్ సింగ్ రాజ్‌నంద్‌గావ్‌లో 1568 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. డిప్యూటీ సిఎం టిఎస్ సింగ్ డియో తన కంచుకోట అయిన అంబికాపూర్‌లో ముందంజలో ఉండగా..  బీజేపీకి చెందిన రాజేష్ అగర్వాల్ రెండో స్థానంలో నిలిచారు. అగర్వాల్ (8802)పై సింగ్ డియో (9944) 1142 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


Also Read: Chhattisgarh Election Results 2023 Live: ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ..!


మెుత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 స్థానాలకు నవంబరు 07న, మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న ఓటింగ్ జరిగింది. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం బీజేపీ ఈ రాష్ట్రంతోపాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్ ల్లో కూడా లీడింగ్ లో ఉంది. 


Also Read: లీడింగ్ లో గెహ్లాట్, వసుంధర.. శివరాజ్, బఘేల్ జోరు..కమలనాథ్ బేజారు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి