BJP MLA Comments: దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచార ఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఇటీవల కాలంలో గ్యాంగ్ రేప్ ఘటనలు చూశాం. హైదరాబాద్ జూల్లీహిల్స్ లో పబ్ కు వచ్చిన మైనర్ బాలికపై కారులోనే గ్యాంగ్ రేప్ చేసిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. మద్యంతో పాటు గంజాయి, డ్రగ్స్ వాడకం పెరగడం వల్లే దారుణాలు పెరిగిపోతున్నాయనే వాదనలు వస్తున్నాయి. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ప్రజా ప్రతినిధి మాత్రం క్రైమ్ రేట్ తగ్గాలంటే గంజాయి తాగాలని చెప్పడం రచ్చకు దారి తీసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చత్తీస్ గఢ్ బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాందే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ కు బదులుగా గంజాయి, బంగ్ లను ప్రోత్సహిస్తే హత్యలు, అత్యాచారాలు తగ్గుతాయని చెప్పారు, మార్వాహి జిల్లాలో  జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే .. మీడియాతో మాట్లాడుతూ ఈ కామెంట్లు చేశారు. మద్యానికి బానిసైన వారు ఎక్కువగా హత్యలు, అత్యాచారం, దోపీడీలకు పాల్పడుతున్నారని చెప్పిన ఎమ్మెల్యే కృష్ణమూర్తి బాందే.. గంజాయి, బంగ్ ను ప్రోత్సహిస్తే ఇలాంటి ఘటనలు జరగవని అన్నారు. క్రైమ్ రేట్ తగ్గాలంటే మద్యానికి బదులు గంజాయి, బంగ్ ను ప్రోత్సహించాలని సూచించారు. ఈ విషయాన్ని తాను అసెంబ్లీలో కూడా చెప్పారని తెలిపారు సదరు బీజేపీ ఎమ్మెల్యే. జూలై 27న జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సమయంలో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావిస్తానని తెలిపారు.


గంజాయి, బంగ్ ను ప్రోత్సహించాలంటూ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నాయి. గౌరవప్రదమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే గంజాయి తాగాలని చెప్పడం ఏంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేపై కేసు పెట్టి జైలుకు పంపించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటరిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ కృష్ణమూర్తి బాందే. మద్యపాన నిషేధం హామీ ఏమైందని కాంగ్రెస్ నేతలను నిలదీశారు.


Read also: థియేటర్‌లో సినిమా చూస్తూ నిద్రపోయిన స్టార్ హీరోయిన్‌.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే?


Read also: Weight Loss: ఈ గ్రీన్‌ టీని రెగ్యూలర్‌గా తాగడం వల్ల.. 5 రోజుల్లో బరువు తగ్గుతారు..!  



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook