Chhattisgarh Budget 2023: హోలీకి ముందు నిరుద్యోగ యువతకు ఛత్తీస్‌గడ్ రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1,21,500 కోట్ల వార్షిక బడ్జెట్‌ను సీఎం భూపేష్ బఘెల్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ.2,500 భృతిని ఆయన ప్రకటించారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల రూపాయలలోపు ఉన్న 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల నిరుద్యోగులకు ఈ భృతి అందజేస్తామని వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, హోంగార్డులు, గ్రామ కొత్వార్‌ల గౌరవ వేతనాన్ని కూడా పెంచుతున్నట్లు బాఘేల్ ప్రకటించారు. ఎన్నికల సంవత్సరంలో యువత, రైతులు, కార్మికులు, మహిళలు, ఉద్యోగులను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. 'గర్బో నవ ఛత్తీస్‌గఢ్' విజన్‌తో సమర్పించిన బడ్జెట్ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందని.. ఇది 'ఛత్తీస్‌గఢ్ మోడల్' లక్ష్యాలను బలోపేతం చేస్తుందని బఘేల్ అన్నారు. 


2018లో ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఈ బడ్జెట్‌ ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. నిరుద్యోగులకు భృతి ఇచ్చేందుకు కొత్త పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కింద 12వ తరగతి ఉత్తీర్ణులైన 18 నుంచి 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే కుటుంబ వార్షికాదాయం రూ.2.50 లక్షలలోపు ఉన్నవారు అర్హులని అన్నారు.


అదేవిధంగా అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలవారీ గౌరవ వేతనం రూ.6,500 నుంచి రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. సహాయకుల  రూ.3,250 నుంచి రూ.5 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు . చిన్న అంగన్‌వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ.4,500 నుంచి రూ.7,500కు పెంచనున్నామని వెల్లడించారు. గ్రామ కొత్వార్ల గౌరవ వేతనాన్ని కూడా పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామ పటేళ్ల నెలసరి గౌరవ వేతనాన్ని రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచుతామన్నారు.


పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్ల గౌరవ వేతనాన్ని నెలకు రూ.2,500 నుంచి రూ.2,800కు పెంచుతున్నట్లు సీఎం బాఘేల్ తెలిపారు. మనేంద్రగఢ్, గిడాం, జాంజ్‌గీర్ చంపా, కబీర్‌ధామ్ జిల్లాల్లో నాలుగు కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. బడ్జెట్‌లో ఎలాంటి కొత్త పన్నుల ప్రతిపాదన లేదని చెప్పారు. ఈ ఏడాది చివర్లో ఛత్తీస్‌గడ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భూపేష్ బఘెల్ వరాల జల్లు కురిపించింది. ఇదే ఆఖరి బడ్జెట్ కావడంతో అన్ని వర్గాలకు సమన్యాయం చేసేందుకు ప్రయత్నించింది.


Also Read: Ind Vs Aus: ఆసీస్‌ టీమ్‌కు బ్యాడ్‌న్యూస్.. చివరి టెస్టుకు కెప్టెన్ కమిన్స్ దూరం 


Also Read: MLA Etela Rajender: నిమ్మకునీరు ఎత్తినట్లు కేసీఆర్ తీరు.. ప్రీతిది వ్యవస్థ చేసిన హత్య: ఈటల రాజేందర్   


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook