Chhattisgarh CM Baghel gets whipped: దీపావళి వేడుకల్లో భాగంగా మరునాడు గోవర్ధన పూజ నిర్వహించడం చత్తీస్‌ఘడ్‌లో ఓ ఆనవాయితీగా వస్తోంది. ఈ గోవర్థన పూజలో గోవులను పూజించి తరించడం అనేది తరతరాలుగా వస్తోన్న ఆచారం... ఆనవాయితీ. అనాదిగా వస్తున్న సంస్కృతి, ఆచారాలను గౌరవిస్తూ చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ ఇవాళ శుక్రవారం దుర్గ్ జిల్లాలోని జంజ్‌గిరి గ్రామంలో జరిగిన గోవర్ధన పూజలో (Govardhan puja) పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న అనంతరం తమ పూర్వ ఆచారం ప్రకారమే ఇదిగో ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా గడ్డితో చేసిన కొరడాతో చేతిపై 8 దెబ్బలు కొట్టించుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అసలు ఏంటీ ఆచారం ? ఎందుకీ సంప్రదాయం ?
గోవర్థన పూజలో పాల్గొన్న ప్రజలు ఇలా అక్కడి గ్రామ పెద్ద చేత గడ్డితో చేసిన కొరడాతో కొట్టించుకుంటే వారి కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందనేది అక్కడి వారి విశ్వాసం. అందులో భాగంగానే చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భూపేల్ భగేల్ కూడా ఇలా కొరడాతో దెబ్బలు (Chhattisgarh CM Baghel gets Whipped) కొట్టించుకున్నారు. 



Also read : Nirmala Sitharaman: గంగిరెద్దుకు క్యూ ఆర్ కోడ్‌..ట్విట్టర్ లో వీడియో షేర్ చేసిన కేంద్రమంత్రి


రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుతూ సీఎం భూపేల్ భగేల్ దీపావళి (Diwali 2021 celebrations) మరునాడైన శుక్రవారం గోవర్ధన పూజ ఉత్సవాల్లో పాల్గొని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఇలా కొరడా దెబ్బలు తిన్నారని అక్కడి ప్రజా సంబంధాల అధికారి మీడియాకు తెలిపారు. ఈ వీడియోను సీఎం భూపేశ్ భగేల్ (Chhattisgarh CM Bhupesh Baghel) ట్విటర్‌లో షేర్ చేసుకోగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also read : Zika Virus in Kanpur: కాన్పూర్‌లో 'జికా' కల్లోలం...ఒక్కరోజే 30 కేసులు నిర్ధారణ..


Also read : Covid-19 cases in India: దేశంలో కొత్తగా 12,729 కరోనా కేసులు, 221 మరణాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook