Rohit Ranjan: జీ న్యూస్ యాంకర్ అరెస్ట్‌కు ఛత్తీస్‌గఢ్ పోలీసుల యత్నం.. యూపీ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే..
Chhattisgarh Police Tries to Arrest Rohit Ranjan: ఛత్తీస్‌గఢ్ పోలీసులు మంగళవారం (జూలై 5) తెల్లవారుజామున 5.30 గం. సమయంలో జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ని అరెస్ట్ చేసేందుకు యత్నించారు.
Chhattisgarh Police Tries to Arrest Rohit Ranjan: ఛత్తీస్‌గఢ్ పోలీసులు మంగళవారం (జూలై 5) తెల్లవారుజామున 5.30 గం. సమయంలో జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ని అరెస్ట్ చేసేందుకు యత్నించారు. ఉత్తరప్రదేశ్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే రోహిత్‌ని అరెస్ట్ చేసేందుకు ఘజియాబాద్‌లోని అతని ఇంటికి వద్దకు వెళ్లారు. దాదాపు 14 మంది ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు రోహిత్ నివాసం వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రోహిత్ ఇంటి గేటు వద్ద ఉన్న సెక్యూరిటీ ఫోన్లను పోలీసులు లాక్కున్నారు.
ఈ ఘటనపై రోహిత్ రంజన్ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'నా ఇంటి బయట ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఉన్నారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే వారు నన్ను అరెస్ట్ చేసేందుకు వచ్చారు. చట్టపరంగా ఇది సరైనదేనా..?' అని అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ఘజియాబాద్ పోలీసులు.. ఇది పోలీసుల దృష్టిలో ఉందని.. నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని బదులిచ్చారు.
ఏఎన్ఐ రిపోర్ట్ ప్రకారం.. ఇటీవల రోహిత్ రంజన్‌పై ఛత్తీస్‌గఢ్‌లో ఎఫ్ఐఆర్ నమోదవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసేందుకు ఘజియాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు వెళ్లారు. ఇటీవల ఓ సందర్భంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ వీడియో స్టేట్‌మెంట్‌ను రోహిత్ రంజన్ తప్పుగా ప్రస్తావించారు. ఆ తర్వాత తప్పును గ్రహించి జరిగినదానికి విచారం వ్యక్తం చేశారు.
కాగా, ఛత్తీస్‌గఢ్ పోలీసులు సివిల్ డ్రెస్‌లో రోహిత్ రంజన్ ఇంటికి వెళ్లడం, ఐడీ కార్డులు కూడా చూపించకుండా అతన్ని అరెస్ట్ చేసేందుకు యత్నించడం పట్ల పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
Also Read: Mega Brothers: మెగా బ్రదర్స్ మధ్య చిచ్చు పెట్టిందెవరు..! జగన్ కు చిరంజీవి ఎందుకు దగ్గరయ్యారు?
Also Read: Man arrested: హిందూ దేవుళ్ల ఫోటోలున్న పేపర్ మీద చికెన్..యూపీలో వ్యక్తి అరెస్ట్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook