Man arrested: హిందూ దేవుళ్ల ఫోటోలున్న పేపర్ మీదే చికెన్ అమ్మకం.. పోలీసుల మీద దాడి.. యూపీలో వ్యక్తి అరెస్ట్!

Man arrested for selling chicken: ఉత్తర ప్రదేశ్ లోని సంభాలా జిల్లాలో హిందూ దేవి దేవతల ఫోటోలు ఉన్న పేపర్ మీద చికెన్ పెట్టి అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 5, 2022, 12:28 PM IST
  • యూపీలో మత విద్వేషాలు రెచ్చగొట్టబోయిన వ్యక్తి అరెస్ట్
  • చికెన్ షాపులో హిందూ దేవి దేవతలున్న పేపర్ మీద చికెన్ అమ్మకం
  • పోలీసులపై దాడికి యత్నంతో అరెస్ట్
 Man arrested: హిందూ దేవుళ్ల ఫోటోలున్న పేపర్ మీదే చికెన్ అమ్మకం.. పోలీసుల మీద దాడి.. యూపీలో వ్యక్తి అరెస్ట్!

Man arrested for selling chicken: మతసామరస్యానికి ప్రతీక అని చెప్పుకునే భారతదేశంలో ఈ మధ్యకాలంలో ఒక మతానికి చెందిన వారి విశ్వాసాలను మరో మతం వారు దారుణంగా దెబ్బతీస్తున్న పరిణామాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. రెచ్చగొట్టాలి అనుకుంటున్నారో లేక నన్నెవరూ ఏం చేయలేరు అనుకుంటున్నారో తెలియదు కానీ ఒక మతం వారు ఎంతో పవిత్రంగా భావించే విషయాలను మరో మతం వారు చాలా దారుణమైన రీతిలో అవమానిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. తాజాగా ఉత్తర ప్రదేశ్ లోని సంభాలా జిల్లాలో హిందూ దేవి దేవతల ఫోటోలు ఉన్న పేపర్ మీద చికెన్ పెట్టి అమ్ముతున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

సదరు వ్యక్తి పోలీసుల మీద కూడా అటాక్ చేసినట్లు తెలుస్తోంది. ముస్లిం వర్గానికి చెందిన తాలిబ్ హుస్సేన్ అనే వ్యక్తి తన చికెన్ షాప్ లో చికెన్ అమ్మే సమయంలో హిందూ దేవి దేవతలు ఉన్న పేపర్ మీద చికెన్ పెట్టి అమ్ముతున్నాడని పోలీసులకు హిందూ వర్గాలకు చెందిన వారు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి పోలీసులు సదరు చికెన్ షాపుకు వెళ్లి ఎంక్వయిరీ చేసే సమయంలో తాలిబ్ హుస్సేన్ పోలీసుల మీద కూడా దాడి చేసి వారిని చంపడానికి ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. 

ఈ నేపద్యంలో తాలిబ్ హుస్సేన్ మీద పలు సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు. తాలిబ్ హుస్సేన్‌పై IPC సెక్షన్లు 153-A [మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం], 295-A [ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్యలు, అవమానించడం ద్వారా మతపరమైన భావాలను కించపరిచే ఉద్దేశ్యంతో ఉన్నట్టు అభియోగాలు మోపారు. అలాగే సెక్షన్ 307 [హత్యా ప్రయత్నం] కింద కూడా కేసులు నమోదు చేశారు. 

ప్రస్తుతానికి ఈ వ్యవహారం మీద పోలీసులు లోతైన దర్యాప్తు జరిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సరిగ్గా కొద్ది రోజుల క్రితమే నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థించాడు అంటూ ఇద్దరు ముస్లిం యువకులు ఒక హిందూ ట్రైలర్ ని చంపిన తరువాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఈ విషయం మీద యూపీ పోలీసులు మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. పోలీసుల మీద దాడి చేసేందుకు కూడా అతను వెనుకాడకపోవడం వెనక ఇంకా ఎవరైనా అదృశ్య శక్తులు ఉన్నారా అనే విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Leena Manimekalai: సిగరెట్ తాగుతున్న కాళీ మాత.. వివాదాస్పదమవుతోన్న పోస్టర్.. డైరెక్టర్ అరెస్ట్‌కు నెటిజన్ల డిమాండ్

Also Read: Mumbai rains: ముంబైలో భారీ వర్షాలు.. నీటమునిగిన పలు ప్రాంతాలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News