Chhattisgarh Election Results 2023 Live: ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ..!
Assembly Election 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ పటిష్ట భద్రత నడుమ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది.
Chhattisgarh Assembly Election Results 2023 Live Updates: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 8.30 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా ప్రస్తుతం ఈవీఎంల ద్వారా కౌంటింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని కౌంటింగ్ కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. ముందస్తు ట్రెండ్‌ల ప్రకారం కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ నడుస్తోంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అత్యధికంగా కాంగ్రెస్ కే పోలయ్యాయి. సీఎం భూపేశ్ బఘేల్, ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్, మాజీ సీఎం రమణ్ సింగ్ ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెుత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ లో రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోని 20 స్థానాలకు నవంబరు 07న, మిగిలిన 70 స్థానాలకు నవంబరు 17న ఓటింగ్ జరిగింది. మరోసారి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కమలదళం అనుకుంటుంది.
Also read: Telangana Election 2023 Result Live: కామారెడ్డిలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. మూడోస్థానంలో సీఎం కేసీఆర్
ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి?
దాదాపుగా అన్ని సర్వేలు కాంగ్రెస్‌కే స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టాయి. ఏబీపీ న్యూస్-సీ ఓటర్ బీజేపీకి 36-48 సీట్లు, కాంగ్రెస్‌కు 41-53 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 36-46 సీట్లు, కాంగ్రెస్‌కు 40-50 సీట్లు వస్తాయని పేర్కొంది. జన్‌కీ బాత్ ప్రకారం బీజేపీకి 34-45, కాంగ్రెస్‌కు 42-53 సీట్లు వస్తాయని తెలిపింది. చాణక్య కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ 57 సీట్లు (ప్లస్-మైనస్ 8) ఇచ్చింది.
Also Read: మధ్యప్రదేశ్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఆధిక్యంలో బీజేపీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి