Chinese Hackers: చైనా హ్యాకర్లు మరోసారి భారత్​ లక్ష్యంగా సైబర్ దాడులకు తెగబడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం అండతో పని చేస్తున్న ఓ హ్యాకర్ల గ్రూప్​.. ఉత్తర భారత్​లోని పవర్​గ్రిడ్​పై దాడి చేసి కీలక సమాచారాన్ని తెలుసుకున్నట్లు ప్రైవేటు ఇంటెలీజెన్స్​ సంస్థ రికార్డెడ్​ ఫ్యూచర్​ తాజా నివేదికలో పేర్కొంది. లద్దాఖ్​ సమీపంలో ఉండే గ్రిడ్​లపై దాడులు చేసినట్లు తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తరాదిలో విద్యుత్​ సరఫరా, నియంత్రణకు సంబంధించి లద్దాఖ్​ పవర్​గ్గరిడ్​ అత్యంత కీలకమైన వాటిల్లో ఒకటి. ఈ నేపథ్యంలో కనీసం ఏడు వరకు 'ఏడు డిస్పాచ్​ కేంద్రాలపై' హ్యాకంర్లు దాడులు చేసి ఉంటారని నివేదిక వెల్లడించింది.


'ఇటీవలి నెలల్లో హ్యాంకర్లు కనీసం 7 భారత ప్రభుత్వ లో్డ్​ సిస్పాచ్​ సెంటర్లపై దాడికి తెగబడినట్లు గుర్తించాం. ముఖ్యంగా అవన్నీ రియల్​టైమ్​ ఆపరేషన్స్​, గ్రిడ్​ కంట్రోల్​ వ్యవస్థలు ఉండే డిస్పాచ్​ సెంటర్లే. ఇవన్నీ వివాదాస్పద భూభాగమైన లద్దాఖ్​ సరిహద్దు ప్రాంతాల్లోనే అధికంగా జరుగుతున్నట్లు తెలిసింది' అని రికార్డెడ్​ ఫ్యూచర్​ పేర్కొంది.


టీఏజీ-38 అనే పేరుతో హ్యాంకర్ల గ్రూప్​ భారత పవర్​గ్రిడ్లపై దాడాలుకు తెగబడినట్లు వెల్లడించింది. ఈ గ్రూప్​ గతంలో చైనా ఆర్మీ, దేశ అంతర్గత భద్రత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధినంలో పని చేసినట్లు తెలిపింది. ఇక హ్యాకింగ్ కోసం షాడోప్యాడ్​ అనే సాఫ్ట్​వేర్​ను వాడినట్లు కూడా గుర్తించింది నివేదిక.


Also read: NEET 2022 Exam Date: ఖరారైన నీట్ 2022 పరీక్ష తేదీ, ఎప్పుడంటే


Also read: JEE Mains: మళ్లీ వాయిదా పడిన జేఈఈ మెయిన్స్ పరీక్షలు, తిరిగి ఎప్పుడంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook