Chiranjeevi Rajya Sabha : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకుంది. ఏప్రిల్ మే నెలల్లో పార్లమెంట్‌తో పాటు ఏపీ, ఒడిషా, అరుణాల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. అంతకు ముందే 15 రాష్ట్రాల్లో 56 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలకు షెడ్యూల్ విడులైంది. ఇందులో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి 3 మూడేసి చొప్పున ఆరు స్థానాలకు ఎన్నికలు జరగున్నాయి. అయితే మారిన అసెంబ్లీ లెక్కల ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్‌కు రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. అటు బీఆర్ఎస్ పార్టీకి 1 దక్కనుంది. అటు ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు స్థానాలు అధికార వైసీపీ వశం కానున్నాయి. ఆ సంగతి పక్కన పెడితే..దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ నుంచి 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒక స్థానం నుంచి చిరంజీవిని బీజేపీ పెద్దలు రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతంలో ఎన్నడు లేనట్టుగా మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి బీజేపీ పెద్దలు ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంనే రీసెంట్‌గా చిరంజీవి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో గౌరవించారు. తాజాగా రాజ్యసభ సీటు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. గతంలోనే రాష్ట్రపతి కోటాలోనే చిరును రాజ్యసభకు నామినేట్ చేయాలని చూసింది. కానీ చిరు అప్పట్లో ఈ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించనట్టు సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి రాజమౌళి తండ్రి.. ప్రముఖ రచయత విజయేంద్ర ప్రసాద్‌ను పెద్దల సభకు నామినేట్ చేసారు. ఆయనతో పాటు పీటీ ఉష, ఇళయరాజా, వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు ప్రెసిడెంట్ కోటాలో నామినేట్ చేసారు.


తాజాగా చిరును ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి.. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పడబోయే ఎన్డీయే ప్రభుత్వంలో చిరుకు మంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు సమాచారం. చిరును రాజ్యసభకు నామినేట్ చేయడం వెనక బీజేపీ పెద్దల స్కెచ్ కనబడుతోంది.  ఈ యేడాది ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. అది కాకుండా ఏపీలో కాపు సామాజిక వర్గంతో పాటు జనసేనానిని ఆకట్టుకునే పనిలో భాగంగా చిరుకు పద్మ విభూషణ్  అవార్డు దక్కిందనే వార్తలు వస్తున్నాయి.


చిరు ముందు నుంచి సేవా కార్యక్రమాల్లో ముందునున్నారు. చిరంజీవి చారిటబుల్ ద్వారా నేత్రదానం,రక్తదానం వంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. చిరులో ఉన్న సేవా దృక్పథమే ఆయన్ని రాజకీయాల వైపు నడిపించింది. 2008 ప్రజారాజ్యం పార్టీ స్థాపించి 2009 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి 18స్థానాలతో సరిపెట్టుకున్నాడు.2009 ఎన్నికల్లో తిరుపతి, పాలకొల్లు నుంచి అసెంబ్లీకి పోటీ చేసారు చిరంజీవి. తన మామ సొంతూరు అయిన పాలకొల్లులో చిరంజీవి కాంగ్రెస్ అభ్యర్థి ఉషారాణి చేతిలో ఓటమిపాలైయ్యారు.


ఆ తరువాత తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున 2012లో  రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆ తర్వాత యూపీఏ 2 నుంచి మన్మోహన్ సింగ్ కేంద్రమంత్రి వర్గంలో పర్యాటక శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ తరుపున ఏపీలో ప్రచారం నిర్వహించిన ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. దీంతో చిరు క్రమంగా రాజకీయాల నుంచి వైదొలిగారు. ప్రస్తుతం సినిమాలే లోకంగా బతుకుతున్నారు.


తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరు కంటే గొప్పవాళ్లు సినిమా రంగంలో ఉన్న వాళ్లను కాదని ఈయనకే ఈ అవార్డు రావడం వెనక పెద్ద తతంగమే నడించిందనే చెబుతున్నారు. ఇక తెలుగులో సినీ రంగం నుంచి అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తర్వాత ఈ అవార్డు అందుకున్న మూడో వ్యక్తి చిరు కావడం గమనార్హం. అటు తెలుగు హీరోల్లో రెండో వ్యక్తి కావడం మరో విశేషం.


ఇప్పటికే చిరు ఫ్యామిలీకి కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ రాజకీయ ప్రాధాన్యత ఇస్తూ ఉంది. 2022లో మెగాస్టార్‌ను ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో గౌరవించింది. అటు G 20 సమ్మిట్ సమావేశాలకు మన దేశం తరుపున చిరు ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్‌కు మాత్రమే ఆహ్వానం అందింది. తాజాగా జరిగిన అయోధ్య భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చిరంజీవి ఫ్యామిలీకి  ప్రత్యేక ఆహ్వానం అందడం వెనక కూడా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ పాత్ర ఉందనే అందరు చెబుతున్నారు. మొత్తంగా చిరుతో కాపులను ఆకట్టుకునే పనిలో భారతీయ జనతా పార్టీ పడిందనే వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కేంద్రం ఆలోచనలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరోసారి రాజ్యసభలో అడుగుపెడతారా లేదా అనేది చూడాలి.


Also read: CAA in India: సీఏఏపై మళ్లీ వివాదం, వారం రోజుల్లో అమలు చేస్తామని కేంద్ర మంత్రి వ్యాఖ్యలు


Also Read: Sharmila Meets Sunitha: షర్మిల మరో సంచలనం.. వివేకా కూతురు సునీతతో భేటీ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి