Court, Not Café : సుప్రీంకోర్టులో ఓ కేసు విచారణలో భాగంగా లాయర్ పదజాలంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని తేల్చిచెప్పారు. ఇదేం కాఫీ షాప్ కాదు..పదాలను వాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు. రాజ్యాంగ పరమైన అంశానికి సంబంధించిన  కేసులో మాజీ సీజేఐను ప్రతివాదిగా చేర్చడం పట్ల సీజేఐ స్పందించారు. వెంటనే ఆయన పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ను ప్రతివాదిగా 2018లో చేర్చినప్పటి పిటిషన్ను లాయర్ ప్రస్తావించారు. దీనిపై సీజేఐ స్పందించారు. ఇది ఆర్టికల్ 32కి సంబంధించినది. అలాంటప్పుడు జస్టిస్ గొగోయ్ ను ఎలా ప్రతివాదిగా మీరు పేర్కొంటారు అని ప్రశ్నించారు. ఆర్టికల్ 32 అనేది పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినప్పుడు రాజ్యాంగపరమైన పరిష్కారాలను పొందే హామీ ఇస్తుందన్నారు. 


ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నకు సదరు లాయర్..అవును అవును జస్టిస్ రంజన్ గొగోయ్ క్యూరిటేవ్ గా చేయమని నన్ను అడిగారని చెబుతున్న సమయంలో ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ..ఇదేమీ కాఫీ షాపు కాదు..మీ భాష ఏంటి...చాలా అసహ్యకరంగా ఉంది. ఇలాంటి పదజాలాన్ని అస్సలు అంగీకరించేది లేదు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జస్టిస్ గొగోయ్ ఈ కోర్టులో మాజీ న్యాయమూర్తి ఆయనపై ఇలాంటి పిటిషన్ వేయలేరు. కోర్టు ముందు దీనిని తీసుకురావడంతో ఫేయిల్ అయ్యారు కాబట్టి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ కోరండి అంటూ స్పష్టం చేశారు. 


Also Read: MP Dharmapuri Arvind: కాంగ్రెస్ ఆ హామీ చూసి నాకే ఓటు వేయాలనిపించింది.. ఎంపీ ధర్మపురి ఇంట్రెస్టింగ్ కామెంట్స్  


అయితే ఈ అంశంపై సదరు న్యాయమూర్తి మాట్లాడుతూ..జస్టిస్ గొగోయ్ నేను చట్టవిరుద్ధమని చేసిన ప్రకటనపై ఆధారపడి నా అభ్యర్థనను తోసిపుచ్చారు.. ఇది చాలా అన్యాయం. ఇక్కడ నా తప్పు ఏమాత్రం లేదు. కార్మిక చట్టాలపై అవగాహన ఉన్న అత్యున్నత ధర్మాసనం ముందు నా పిటిషన్ పంపించాలని అభ్యర్థించాను. కానీ అలా జరగలేదు. దాన్ని కొట్టిపారేశారు అంటూ తెలిపారు. హైకోర్టు తీర్పును సవాల్ చేసినప్పుడు జడ్జిని తప్పుబట్టలేమని సీజేఐ పేర్కొన్నారు. 


ఈ పిటిషన్‌ను రిజిస్ట్రీ పరిశీలిస్తుందని, ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న జస్టిస్ గొగోయ్ పేరును తన పిటిషన్ నుండి తొలగించాలని పిటిషనర్‌ను కోరినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. అంతేకాదు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రమైన క్రిమినల్ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించిన కారణంగా ఆమెను పదవి నుండి తొలగించడానికి కోర్టు జోక్యాన్ని కోరిన సీనియర్ న్యాయవాదిని కూడా ఆయన మందలించారు.అంతేకాదు గతంలోనూ చాలా సందర్భంలో  కోర్టులో లాయర్ల తీరుపై సీజేఐ ఆగ్రహం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. 


Also Read: Hyderabad to Ayodhya Flight Service: రామభక్తులకు అదిరిపోయే శుభవార్త..  భాగ్య నగరం నుంచి నేరుగా అయోధ్యకు విమాన సర్వీసులు..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.