ఓట్ షేర్‌లో కాంగ్రెసే ముందంజ
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నా.. ఓట్ షేర్‌లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్‌తో దాదాపు సమఉజ్జీగానే ముందుకు వెళ్తోంది.
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతున్నా.. ఓట్ షేర్‌లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్‌తో దాదాపు సమఉజ్జీగానే ముందుకు వెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ 46 శాతం శాతంతో ముందంజ వేయగా.. బీజేపీ 45 శాతంతో కాస్త వెనుకబడి ఉండడం గమనార్హం.
కచ్చితంగా బీజేపీ పార్టీయే రెండు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని హోం మంత్రి రాజనాథ్ సింగ్ తెలిపారు.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా.. తను మాత్రమే ఎప్పుడూ విక్టరీ వైపు పయనం అన్నట్లు అభివాదం చేస్తున్న మోదీ. పార్లమెంటుకి వస్తున్నపుడు ఈ ఫోటోని క్లిక్‌మనిపించింది మీడియా.
గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి విజయ్ రూపానీ 21,000 ఓట్లతో లీడింగ్‌లో ఉన్నారు.
సిమ్లా రూరల్ అభ్యర్థి విక్రమాదిత్య కాంగ్రెస్ మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని బలంగా చెబుతున్నారు.