Rahul Gandhi Pub Video: రాహుల్ గాంధీ నేపాల్ పర్యటనపై రాజకీయ రచ్చ ముదురుతోంది. లీకైన రాహుల్ నైట్ క్లబ్ వీడియోను బీజేపీ నేతలు వైరల్ చేస్తున్నారు. రాహుల్ తో ఉన్నది ఎవరంటూ నిలదీస్తున్నారు. కమలం నేతల ఆరోపణలకు ధీటుగా కౌంటరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మ్యారేజీ వేడుకకు రాహుల్ గాంధీ వెళ్లడం నేరమా అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ బర్త్ డేకు ఎలాంటి ఆహ్వానం లేకుండానే నరేంద్ర మోడీ వెళ్లినట్లు.. రాహుల్ వెళ్లలేదుగా అని సూర్జేవాలా అన్నారు.  
తన ఫ్రెండ్ ఆహ్వానం మేరకే రాహుల్ గాంధీ పెళ్లికి హాజరయ్యేందుకు నేపాల్ వెళ్లారని చెప్పారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 





తమ నాయకుడు రాహుల్ గాంధీ టూర్ లో ఉన్నారని చెప్పారు సూర్జేవాలా. ఆయన పార్టీకి వెళ్లడంలో తప్పు ఏముందో చెప్పాలని కమలం నేతలకు సవాల్ విసిరారు సూర్జేవాలా. దేశంలో ప్రస్తుతం కరెంట్ సంక్షోభం తీవ్రంగా ఉందని.. చాలా రాష్ట్రాల్లో కోతలు పెంచారని చెప్పారు. దేశ ద్రవ్యోల్బణం పరిస్థితి కూడా దారుణంగా ఉందన్నారు. ఈ సమస్యలను పక్కదారి పట్టించేందుకే బీజేపీ కొత్త డ్రామాలు చేస్తుందని, రాహుల్ పెళ్లి వేడుక విషయంలో తప్పుడు ప్రచారం చేస్తూ రాద్ధాంతం చేస్తుందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా మండిపడ్డారు. 


కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా రాహుల్ విషయంలో తీవ్రంగా స్పందించారు. గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి.. సాధారణ వ్యక్తిలా మ్యారేజీ రిసెప్షన్కు వెళితే తప్పేంటని ఠాగూర్ ప్రశ్నించారు. రాహుల్ పాల్గొన్న వేడుకలో ఏం తప్పు జరిగిందో దర్యాప్తు చేసుకోవచ్చన్నారు. అనవసరంగా రాహుల్ పై విమర్శలు చేయకుండా.. ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తే మంచిదని బీజేపీ నేతలకు హితవు పలికారు మాణిక్కం ఠాగూర్. బీజేపీ నేతలు ఎవరూ పబ్ లకు వెళ్లలేదా అని నిలదీశారు. గతంలో బీజేపీ నేతలకు పబ్ లకు వెళ్లిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.


Also Read: Rahul Night Club Video:రాహుల్ నైట్ క్లబ్ వీడియో.. తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం..


Also Read: National Medical Commission Bill: ఎంబీబీఎస్‌ విద్యలో రాబోతున్న కీలక మార్పులు..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి