కాంగ్రెస్ నలుగురు గాంధీలను ఇస్తే, బీజేపీ ముగ్గురు మోదీలను ఇచ్చింది : సిద్ధూ
కాంగ్రెస్ నలుగురు గాంధీలను ఇస్తే, బీజేపీ ముగ్గురు మోదీలను ఇచ్చిందని నరేంద్ర మోదీని ఎద్దేవా చేసిన సిద్ధూ
కోటా: కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్ల పాలనలో దేశానికి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నలుగురు గాంధీలను ఇస్తే, బీజేపీ మాత్రం నిరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ వంటి ముగ్గురు మోదీలను ఇచ్చిందని టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత పంజాబ్ రాష్ట్ర మంత్రి నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ బీజేపీని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అయితే ప్రముఖ వ్యాపారవేత్త అంబాని ఒడిలోనే కూర్చున్నారని నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోటాలో జరిగిన రోడ్ షోలో సిద్ధూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : వాచ్‌మన్ వద్ద ఉండే కుక్క కూడా దొంగతో చేతులు కలిపింది : నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ
నిన్న శనివారం రాజస్తాన్‌లోని అల్వార్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలోనూ రఫెల్ డీల్ వివాదాన్ని లేవనెత్తిన సిద్ధూ.. యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో కేంద్రం రూ.30,000 కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించిన సంగతి తెలిసిందే.