Jharkhand Assembly Election Result 2024: జార్ఖండ్ లో ఎన్​డీఏ, ఇండి కూటముల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లతో ఓట్ల లెక్కింపు మొదలైంది  కౌంటింగ్‌ కోసం మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అధికార జార్ఖండ్‌ ముక్తి-మోర్చా-JMM, కాంగ్రెస్‌ కూటమి, ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భవితవ్యం ఏంటో తేలిపోయింది. ఈ ఫలితాలపై రెండు కూటముల నేతల్లో ఆసక్తి నెలకొంది. ముందుగా బీజేపీ నేతృత్వంలోని కూటమి ముందుగా లీడ్ గా వచ్చినా.. ఆ తర్వాత జేఎంఎం కూటమి అభ్యర్ధులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం జేఎంఎం, కాంగ్రెస్ కూటమి అభ్యర్ధులు 50 పైగా సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అభ్యర్ధులు 30 స్థానాల్లో లీడ్ లో ఉన్నారు. 2000 సంవత్సరం నవంబర్‌ 15న జార్ఖండ్‌ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పోలింగ్‌ సరళి  చూస్తే , ఈసారే ప్రజలు అత్యధికంగా ఓట్లు వేశారు. రికార్డు స్థాయిలో 67.74 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లను  కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరుండి పరిశీలించింది.  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి విడివిడిగా పరిశీలకులను నియమించింది. కౌంటింగ్‌ సజావుగా సాగేందుకు  ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ కు ఒక ఏఆర్​ఓను నియమించినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పార్టీ  ప్రతినిధులు, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్‌ల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది.  ఉదయం 8 గంటల నుంచి పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఆ తర్వాత  ఈవీఎంలలో ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది.  


జార్ఖండ్‌లోని 81 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 13, 20 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ జరిగింది. తొలి విడతలో 43 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగగా, మిగిలిన 38 స్థానాలకు రెండో విడతలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో అధికార జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమి, ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవాలని జేఎంఎం ఎన్నికల బరిలో నిలవగా, తిరిగి ఝార్ఖండ్‌ సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఈ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డింది. కానీ ఓటర్లు మాత్రం బీజేపీ నేతలు హేమంత్ సోరెన్ అరెస్ట్ నేపథ్యంలో సానుభూతి పవనాలు వీచినట్టు తెలుస్తుంది. దీంతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.


ఈ ఎన్నికల్లో ప్రముఖ నాయకుల భవితవ్యాన్ని నిర్ణయించే కొన్ని స్థానాలపై అందరి దృష్టి నెలకొంది.  సీఎం హేమంత్‌ సోరెన్‌ బర్‌హైట్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలవగా అక్కడ భారీ మెజారిటీ దిశగా దూసుకుపోతున్నారు.  ఆయన భార్య కల్పనా సోరెన్‌ గాండే స్థానం నుంచి పోటీ చేశారు. జార్ఖండ్‌ బీజేపీ నాయకుడు ప్రతిపక్షనేత అమర్‌ కుమార్ బౌరీ చందన్‌కియారీ నియోజకవర్గంలో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.  


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter