భారత్ జోడో యాత్ర ఇప్పుడు అలయన్స్ తోడో యాత్రగా మారనుందా అంటే పరిస్థితులు అలానే కన్పిస్తున్నాయి. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం తీవ్రమౌతోంది. కాంగ్రెస్-శివసేన బంధం చీలికకు దారితీస్తోంది. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఏ ఇబ్బందుల్లేకుండా సాగుతుందనుకున్న కాంగ్రెస్ - శివసేన బంధాన్ని ప్రశ్నార్ధకం చేస్తోంది. ఈ బంధంపై వీర్ సావర్కర్ వ్యవహారం ప్రభావం చూపిస్తోంది. మహారాష్ట్రలో ఏర్పడిన మహా వికాస్ అఘాడి సంకీర్ణంలో కొనసాగలేమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పటికే వ్యాఖ్యానించడం దీనికి ఉదాహరణ. 


అసలేం జరిగింది


క్విట్ ఇండియా మూమెంట్ సందర్భంలో బ్రిటీషు ప్రభుత్వం వేలాదిమందిని జైళ్లలో వేసింది. ఇందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు వీర్ సావర్కర్ కూడా జైళ్లో ఉన్నారు. జైలు నుంచి విముక్తి అయ్యేందుకు బ్రిటీషు ప్రభుత్వంతో వీర్ సావర్కర్ చేతులు కలపడమే కాకుండా..క్షమాపణలు కోరారనే ప్రచారం చాలాకాలంగా ఉంది. దీనికి సంబంధించి బ్రిటీషు ప్రభుత్వానికి నాడు వీర్ సావర్కర్ రాసిన లేఖ కూడా చాలా సందర్భాల్లో బయటికొచ్చింది. 


ఇప్పుడు భారతో జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఈ విషయాన్ని లేవనెత్తి కూటమిలో విబేదాలకు కారణమయ్యారు. ఎందుకంటే వీర్ సావర్కర్‌కు భారత్ రత్న ఇవ్వాలనేది శివసేన చాలాకాలంగా చేసిన డిమాండ్. అంటే శివసేన.. వీర్ సావర్కర్‌ను అంతలా అభిమానిస్తుది. అలాంటి సావర్కర్‌ను రాహుల్ గాంధీ అవమానించడంతో కాంగ్రెస్-శివసేన కూటమిలో విభేదాలు ఏర్పడ్డాయి.


వీర్ సావర్కర్‌ను అవమానించలేదు


వీర్ సావర్కర్‌పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కొంపముంచేలా ఉందని గ్రహించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పందించారు. సావర్కర్‌ను టార్గెట్ చేయలేదని..ఓ చారిత్రక వాస్తవాన్ని చెప్పారని తెలిపారు. అదే సమయంలో శివసేన అభ్యర్ధనను అంగీకరిస్తున్నామన్నారు. ఈ వ్యవహారం మహా వికాస్ అఘాడిని బలహీనపరుస్తుందనే అభిప్రాయాన్ని ఖండించారు. సావర్కర్ ప్రభావం కూటమిపై ఉండబోదన్నారు. 


రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రేపిన దుమారంపై ఇంకా శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే స్పందించలేదు. త్వరలో ఆయన చేసే ప్రకటనపైనే కాంగ్రెస్-శివసేన బంధం ఆధారపడి ఉంటుంది. 


Also read: Mainpuri By Elections: యూపీ రాజకీయాల్లో అనూహ్య ఘటన.. ఆయన పాదాలకు అఖిలేష్ యాదవ్ నమస్కారం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook