కరోనా మహమ్మారి పార్లమెంట్‌లోనూ కలకలం రేపుతోంది. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన వారిలో దాదాపు 20 మంది ఎంపీలు కరోనా బారిన పడ్డారు. అన్ని రాష్ట్రాలలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. మధ్యప్రదేశ్‌లో ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ఆ రాష్ట్రంలో తాజాగా మరో ఎమ్మెల్యేను కరోనా మహమ్మారి (MLA Dies With CoronaVirus) బలితీసుకుంది. UPSC: ఎన్డీఏ, నేవీ ఫైనల్ రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బియోరా కాంగ్రెస్ ఎమ్మెల్యే గోవర్ధన్ డాంగి కరోనాతో మృతి చెందారు (Govardhan Dangi Dies With CoronaVirus). కొన్ని రోజుల కిందట ఆయనకు టెస్టులు నిర్వహించగా కోవిడ్19 పాజిటివ్‌గా తేలింది. దీంతో భోపాల్‌లోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆరోగ్యం విషమించడంతో భోపాల్ నుంచి ఢిల్లీ గురుగ్రామ్ వేదాంత హాస్పిటల్‌కు తరలించి ఎమ్మెల్యే గోవర్ధన్ డాంగికి కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు.



ఈ క్రమంలో చికిత్స పొందుతూనే మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నుమూశారు.  మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సైతం ఎమ్మెల్య గోవర్ధన్ డాంగి మృతిపట్ల సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. LockDown: సెప్టెంబర్ 25 నుంచి మరో లాక్‌డౌన్.. స్పందించిన కేంద్రం 


ఫొటో గ్యాలరీలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR