MP Santokh Singh Chaudhary Passed Away: భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి కన్నుమూశారు. పంజాబ్‌లోని ఫిల్లౌర్ వద్ద భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడుస్తుండగా.. అకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. రోడ్డుపై కుప్పకూలి పడిపోగా.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన  జలంధర్‌కు ఎంపీగా ఉన్నారు. రాహుల్ గాంధీ వెంటనే జోడో యాత్రను నిలిపివేసి.. ఆసుపత్రికి చేరుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రాహుల్ గాంధీతో కలిసి సంతోక్ సింగ్ చౌదరి జోడో యాత్ర నడుస్తున్నారు. రోడ్డుపై నడుస్తున్న సమయంలో ఆయన ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయారు. దీంతో వెంటనే ఫగ్వారాలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు. భారత్ జోడో యాత్ర నేటికి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. సంతోక్ సింగ్ చౌదరి కుమారుడు విక్రమ్‌జిత్ సింగ్ చౌదరి ఫిలింనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు.


ఎంపీ సంతోక్ సింగ్ మృతి పట్ల పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంతాపం వ్యక్తం చేశారు. సంతోక్ సింగ్ అకాల మరణం పట్ల తాను చాలా బాధపడుతున్నట్లు ట్వీట్ చేశారు. దేవుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నానని అన్నారు.


 



సంతోఖ్ సింగ్ చౌదరి పంజాబ్‌లోని జలంధర్ ఎస్సీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లోని ఫిల్లౌర్‌లోని నూర్ మహల్ రోడ్‌లోని లంద్రా హౌస్‌లో నివాసం ఉంటున్నారు. బీఏ, ఎల్ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 2014,  2019 ఎన్నికల్లో జలంధర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు. ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించేందుకు రాహుల్ గాంధీ సంతోఖ్ సింగ్ నివాసానికి చేరుకోనున్నారు.


Also Read: TPSC Group1 Results: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి కానుక, గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు


Also Read: Team India Squads: టీ20ల నుంచి రోహిత్ శర్మ, కోహ్లీ ఔట్.. పృథ్వీ షాకు పిలుపు.. వన్డే జట్టులోకి ఊహించని ప్లేయర్‌కు చోటు  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి