లోక్ సభ ఎన్నికలు: 2 రాష్ట్రాల్లో 15 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
లోక్ సభ ఎన్నికలు: అభ్యర్థుల తొలి జాబితాలో ప్రియాంకా గాంధీకి దక్కని చోటు
న్యూఢిల్లీ: మరో రెండుమూడు రోజుల్లో లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుందనగా అంతకన్నా ముందుగానే కాంగ్రెస్ పార్టీ గురువారం గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 15 మంది లోక్ సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఎన్నికల హంగామాకు తెరలేపింది. తొలి విడత జాబితా కింద గుజరాత్ నుంచి నలుగురు, ఉత్తర్ ప్రదేశ్ నుంచి 11 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ గురువారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ఈ జాబితాలో గుజరాత్ నుంచి భరత్ సింగ్ సోలంకి (ఆనంద్), రాజు పర్మార్ అహ్మెదాబాద్ వెస్ట్ - ఎస్సీ), ప్రశాంత్ పటేల్ (వడోదరా), రంజిత్ మోహన్ సింగ్ రత్వా (చోటా ఉదయ్‌పూర్ - ఎస్సీ) ఉన్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాహుల్ గాంధీ(అమేథి), సోనియా గాంధీ (రాయ్ బరేలి), సల్మాన్ ఖుర్షీద్ ( ఫరూఖాబాద్), అన్ను టాండన్ (ఉన్నావ్), ఇమ్రాన్ మసూద్ (సహ్రాన్‌పూర్), సలీం ఇక్బాల్ షేర్వానీ (బదౌన్), జితిన్ ప్రసాద్ (దౌరాహ్రా), రాజారాం పాల్ (అక్బర్‌పూర్), బ్రిజ్‌లాల్ ఖబ్రి (జలౌన్ - ఎస్సీ), నిర్మల్ ఖత్రి(ఫైజాబాద్), ఆర్పీఎన్ సింగ్ (ఖుషీనగర్) ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 15 మంది అభ్యర్థుల తొలి జాబితాలో ప్రియాంకా గాంధీ పేరు లేకపోవడం గమనార్హం.