Congress Victory Secret: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వెలువడ్డాయి. అధికార పార్టీ బీజేపీ ఓటమి అంగీకరించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటేసి భారీ ఆధిక్యాన్ని అందుకున్న కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్దమౌతోంది. కాంగ్రెస్ విజయం వెనుక ఆ పార్టీ నేతల కృషితో పాటు మరో వ్యక్తి కష్టం క‌నిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం వెనుక విన్పిస్తున్న ప్రధానమైన పేరు సునీల్ కానుగోలు. ఎన్నికల్లో ఇతడి పేరు లేదా ఫోటో ఎక్కడా కన్పించకపోయినా వ్యూహాలు మాత్రం బలంగా పనిచేశాయి. మైండ్ షేర్ యునైటెడ్ పేరుతో ఇతని సంస్థ కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకు వ్యూహాలు రచించింది. కన్నడనాట అధికారం కోసం ప్రయత్నించింది. పార్టీలోని గ్రూప్ విబేధాలను పక్కనపెట్టి ఏకతాటిపై పనిచేసేలా చేసింది. మైండ్ షేర్ యునైటెడ్ బ్యానర్‌తో సునీల్ కానుగోలు రోజుకు 20 గంటలు పనిచేసినట్టు తెలుస్తోంది.


దేశమంతా మోదీ మేనియా ఉన్నా కర్ణాటకలో పనిచేయలేదు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు మంగళం పాడారు. కాంగ్రెస్ పార్టీకు భారీ విజయాన్ని అందించారు. 224 సభ్యులున్న అసెంబ్లీలో అధికారానికి కావల్సిన మేజిక్ ఫిగర్ 113 కాగా, 136 సీట్లు సాధించింది. బీజేపీ మాత్రం 64 స్థానాలకే పరిమితమైంది. అటు జేడీఎస్ 20 స్థానాల్లో, ఇతరులు 4 స్థానాల్లో గెలిచారు. బీజేపీ ప్రభుత్వ అవినీతి, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్లస్ పాయింట్‌గా మారినా..క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచించింది ఈ సంస్థనే. ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరెక్కడ ఏ అంశంతో ప్రచారం చేయాలనే అంశాల్ని టార్గెట్ చేసింది. పార్టీలో రెండు వర్గాలుగా ఉన్న సిద్ధ రామయ్య డీకే శివకుమార్ కలిసి పనిచేసేలా చేసిన వ్యక్తి. అదే రాష్ట్రంలో కాంగ్రెస్ విజయానికి ప్రధాన కారణమైంది. 


వాస్తవానికి సునీల్ కానుగోలు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు దగ్గరి వ్యక్తి. కానీ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఆ పార్టీకే పనిచేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రచార బాధ్యత కూడా ఈయన మాతృసంస్థ ఇన్‌క్లూజివ్ మైండ్స్‌దే. సునీల్ వ్యూహాలు కర్ణాటకలో వర్కవుట్ అయి ఆ పార్టీకు ఘన విజయాన్ని అందించాయి. ఇకపై తెలుగు రాష్ట్రాల్లో సైతం ఆయన పనిచేయనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకు ఆయనే పనిచేస్తున్నారు ప్రస్తుతం. కర్ణాటక విజయంతో సునీల్ పేరు మార్మోగిపోతోంది. 


Also read: Karnataka Exit polls vs Results: విఫలమైన ఎగ్జిట్ పోల్ అంచనాలు, నిజమైన జీ న్యూస్, ఆత్మసాక్షి ఎగ్టిట్ పోల్ ఫలితాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook